Gathakalamantha kachithivayya yentho manchiga గతకాలమంత కాచితివయ్యా ఎంతో మంచిగ చూచితివయ్యా


Song no:

గతకాలమంత కాచితివయ్యా
ఎంతో మంచిగ చూచితివయ్యా
నీ మేలులని తల పోసెదవయ్యా
నీ జ్ఞాపకాలు చెరిగిపోదు
స్తోత్రమయ్య యేసయ్య
స్తుతి స్తోత్రమయ్యా

నా కెన్నో మేలులు చేసితివయా
నా అక్కరలన్నియూ తీర్చితివయా
ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయా
ఏ విధముగ నిన్ను కొనియాడెదనయా

నా కన్నుల కన్నీళ్ళు తుడిచితివయా
నా హృదయపు వాకిటనే నిలచితివయా
నీడ వలె నన్ను వెంబడించితివయా
నీ కృపలో నన్ను దాచితివయా

నా కన్నుల కన్నీరు జారిపడనీయక
నీ కవిలేలోనే దాచితివయా
నా కన్నులు తెరచినా
కన్నులు మూసినా
నా మదిలో కదలాడే ప్రతిరూపమా
أحدث أقدم