Bethlehemulo pashula pakalo బెత్లెహేములో పశుల పాకలో

బెత్లెహేములో పశుల పాకలో
మరియు ఒడిలో దైవతనయుడు
మానవునిగా పుడమి అవతరించెను ఓ రక్షకునిగ
హల్లెలూయా - హల్లెలూయా (2)
వెలుగుకోసం వెతుకులాడుచు
పరితపించె ప్రాణికోటికి
ఒకతార కదలివచ్చును
దివ్యతేజం అనుగ్రహించెను(2)
పాపమంతయు పరిహరించును
శాపమంతయు సంహరించును
శాంతి నీకు అనుగ్రహించును
పరమునకు నిన్ను చేర్చును (2)
أحدث أقدم