Pai numdi dhigivacche yerushalema nee samayam పై నుండి దిగివచ్చె యెరుషలేమా నీ సమయం సంపూర్ణమా


Song no:


పై నుండి దిగివచ్చె యెరుషలేమా
నీ సమయం సంపూర్ణమా గడియకు . . (2)
రాజాధి రాజునకు ఆహ్వానము
ప్రభువుల ప్రభువుకు జయగీతము (2)
ధగధగ మెరియుచు సొగసుగ నున్నాది
దివ్య నగరితళతళ మంటు ప్రతిభింబిస్తుంది (2)

1. భూలోక గోళముపై దైవపుత్ర సహవాసం
హృదయాలలో ఒక్కటిగ జేరి ఆత్మ పూర్ణులైతిరి
చేనెలోని ద్రవ్యమా మేలిమైన ముత్యమా
సంతసించు ఉల్లసించు వేచిన నీ దినము వచ్చె

2. పరలోక పట్టనము రతనాల రమణియం
వివిధ వర్ణ భూషితము సృష్టి కర్త నైపుణ్యం
జేష్టులైన బృందమా కీర్తిగొన్న నేస్తమా
దవళవస్త్ర సైన్యమా నింగి నేల నేలుమా

أحدث أقدم