Ninu chuse kannulu naku iemmaya ninu piliche pedhavulu iemmu yesayya నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా


Song no:

నిను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా
నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా (2)
నిను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా
నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా

కన్నీటి ప్రార్ధన నాకు నేర్పయ్యా
ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా (2)
నీ కొరకే జీవించే సాక్షిగ మార్చయ్యా
నాలోనే నిను చూపే మాదిరి నివ్వయ్యా

అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా
మృదువైన మాటతీరు నాకు ఇవ్వయ్యా (2)
కోపతాపములను దూరపరచయ్యా
అందరినీ క్షమియించే మనస్సు ఇవ్వయ్యా

లోతైన ఆత్మీయత నాకు ఇమ్మయ్యా
లోబడుట నాకు నేర్పు యేసయ్యా
లోపములన్ గ్రహించే కృపను ఇమ్మయ్యా
లోకాన్ని జయించే జీవిత మివ్వయ్యా
أحدث أقدم