Chudumu e kshaname kalvaarini prema prabhuvai neekai చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను

Song no:

చూడుము ఈ క్షణమే కల్వరిని -
ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను
గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు
సిలువలో వ్రేలాడు చున్నాడుగా -
సిలువలో వ్రేలాడు చున్నాడుగా } 2

మానవులెంతో చెడిపోయిరి -
మరణించెదమని తలపోయక || 2 ||
ఎరుగరు మరణము నిక్కమని -
నరకమున్నదని వారెరుగరు      || 2 || చూడుము ||

ఇహమందు నీకు కలవన్నియు -
చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను నీవు లేచెదవు -
తీర్పున్నదని యెరుగు ఒక దినమున || 2 || చూడుము ||

మనలను ధనవంతులుగ చేయను -
దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై -
అంగీకరించుము శ్రీ యేసుని || 2 || చూడుము ||

సిలువపై చూడుము ఆ ప్రియుని -
ఆ ప్రేమకై నీవు యేమిత్తువు }2
అర్పించుకో నీదు జీవితము -
ఆయన కొరకై జీవించుము || 2 || చూడుము ||

Choodumu ee kshaname kalvarini -
prema prabhuvu neekai nilachundenu
goppa rakshananivva sree yesudu
siluvalo vrelaadu chunnaadugaa -
siluvalo vrelaadu chunnaadugaa

maanavulentho chedipoyiri -
maranichedamani talapoyaka || 2 ||
erugaru maranamu nikkaamani -
narakamunnadani vaarerugaru || 2 || choodumu ||

ihamandu neeku kalavanniyu -
chanipovu samayaana ventaraavu
chanipoyinanu neevu lechedavu -
teerpunnadani yerugu oka dinamuna || 2 || choodumu ||

manalanu dhanavantuluga cheyanu -
daridrudaayenu mana prabhuvu
raktamu kaarchenu paapulakai -
angeekarinchumu sree yesuni || 2 || choodumu ||

siluvapai choodumu aa priyuni -
aa premakai neevu yemittuvu
arpinchuko needu jeevitamu -
aayana korakai jeevinchumu || 2 || choodumu ||

أحدث أقدم