Dhorukuthavura sahodhara dhorukuthavura neevu tharimi దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు


Song no:

దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు
తరిమి తరిమి కీడుచేయ - పరుగులెత్తిన గాని తుదకు ||దొరుకు ||

1.చిన్నచూపు చూచి తమ్ముని - కన్నెఱుంగక చంపిన గాని
అన్న కయిాను దేవుని - హస్తమునకు దొరికిన రీతిగా ||దొరుకు ||

2.వరములొందిన తమ్ముని - జంపవలయునని పంతముగబట్టి
నరకవచ్చిలోబడి యేడ్చిన - దురిత చరితుని ఏశావువలె ||దొరుకు|

3.భక్త దావీదును బట్టి - ప్రాెణము దీయగ దలచిన తన
శక్తితో తరిమిన రాజగు - సౌలు దొరికినరీతి గాను ||దొరుకు ||
4.విగ్రహము నకు మ్రెుక్కని దైవ - పిల్లల నగ్నలోపడవైచి
ఆగ్రహించిన నెబుకద్నెజరు - గడ్డిమేసి దొరికిన విధముగా||దొరుకు||
5.క్రైస్తవులను బట్టి కొట్టి - ఖైదులో వేయదలచినను
వాస్తవమగు వెలుగును జూచి - ప్రభుని చాటిని పౌలు బోలి  ”దొరుకు
أحدث أقدم