Theliyajeya randi christmas theliyajeya randi christmas తెలియజేయ రండి క్రిస్మస్ తెలియజేయ రండి


Song no:


తెలియజేయ రండి క్రిస్మస్ తెలియజేయ రండి
క్రీస్తుజన్మకు అర్థం - పండుగలో పరమార్థం
పండుగలో ఉన్న పరమార్థం
బెత్లెహేం పురమందు రక్షకుడు పుట్టెనని
సంతసం కలిగించే వర్తమానము ఇదని
గొల్లవారికి తెలియజేసిన గాబ్రియేలువలె
గాబ్రియేలు దూతవలె
తెలియజేయ రండి క్రిస్మస్ తెలియజేయ రండి
ఉన్నత స్థలములలో దేవునికి మహిమయని
భూమిపై తన ప్రజలకు నెమ్మది కలుగునని
దేవదేవుని మహిమపరచిన పరలోక సైన్యమువలె
పరలోక సైన్య సమూహమువలె
మహిమపరచను రండి దేవుని మహిమపరచను రండి
యూదులకు రారాజు జన్మను తెలుసుకొని
కానుకలు పట్టుకొని శిశువును కలుసుకొని
నీతిరాజుకు పూజ చేసిన తూర్పు జ్ఞానులవలె
తూర్పు దేశపు జ్ఞానులవలె
పూజచేయను రండి రాజుకు పూజచేయను రండి

أحدث أقدم