Siramu mida mulla sakshiga karchina kannila sakshiga శిరము మీద ముళ్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా

శిరము మీద ముళ్ల సాక్షిగా
కార్చిన కన్నీళ్ళ సాక్షిగా        " 2 "
పొందిన గాయాల సాక్షిగా
చిందిన రుధిరంబు సాక్షిగా   " 2 "
యేసు నిన్ను పిలచుచున్నాడు
నీ కొరకే నిలచియున్నాడు    " 3 "
సర్వపాప పరిహారం కోసం
రక్త ప్రోక్షణం అవశ్యమని         " 2 "
మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని
పరమాత్ముడే బలియై తిరిగిలేవాలని
ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం
యేసులోనే నెరవేరెనుగా
సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ మవశ్యం
తద్ రక్తం పరమాత్మేనాం
పుణ్యదాన బలియాగం
ఆర్య ఋషులు పలికిన ఆ....వేద సత్యం
క్రీస్తులో........నే నెరవేరెనుగా
యేసే బలియైన పరమాత్మ   " శిరము "

మహా దేవుడే ఇలకేతెంచి
యజ్ఞ పశువుగా వధ పొందాలని  " 2 "
కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని
శిరముపైన 7 ముళ్ళ గాయాలు పొందాలని
బ్రహ్మణాలు పలికిన ఆ.....వేద సత్యం
క్రీస్తులో.......నే నెరవేరెనుగా
*చత్వారి శ్రుగ్నత్రయో అస్యపాద ద్యే
శీర్షే సప్త హస్తాసో !
అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి*
మహో దేవో మర్త్యాం ఆవివేశ ఇథి!!
బ్రహ్మణాలు పలికిన దేవోక్తి
యేసులో......నే నెరవేరెనుగా
యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా
   
أحدث أقدم