Neetho sneham naku pranam naatho bandham adhi nee thyagam నీతో స్నేహం నాకు ప్రాణం నాతో బంధం అది నీ త్యాగం


Song no:

నీతో స్నేహం నాకు ప్రాణం
నాతో బంధం అది నీ త్యాగం
మిత్రమా నా మిత్రమా
చిత్రము ఇది చిత్రము
పల్లవి :
మిత్రమా నా మిత్రమా
చిత్రమా ఇది నీ చిత్తమా
మిత్రమా నా యేసయ్యా
చిత్రమే ఎంతో చిత్రమే

స్నేహం నీ స్నేహం
ప్రాణం నాకు ప్రాణం
నీ స్నేహం నాకు ప్రాణం
ప్రాణం నీ స్నేహం

నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా
|| మిత్రమా - చిత్రమే ||

చరణం 1:
మట్టిని మనిషిగ మలచినావు
మనిషిని మమతతో నింపినావు
మమతకు మంచిని నేర్పినావు
మంచికి మనసును ఇచ్చినావు

మట్టిని మనిషిగ మలచినావు ఎందుకో
మనిషిని మమతతో నింపినావు ఏమిటో
మమతకు మంచిని నేర్పినావు ఎందుకో
మనసుకు మనసును కలిపినావు

ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ
ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ

|| మిత్రమా - చిత్రమే ||

చరణం 2:
కంటి నీరు తుడిచినావు
కంటికి రెప్పై నిలిచినావు
వింతగ నన్ను వలచినావు
తండ్రివై నన్ను పిలిచినావు

కంటి నీరు తుడిచినావు ఎందుకో
కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో
వింతగ నన్ను వలచినావు ఏలనో
తండ్రివై నన్ను పిలిచినావు

రతనాల రాశులలో నిలిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ
రతనాల రాశులలో నిలిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ


మిత్రమా నా మిత్రమా
చిత్రమా ఇది నీ చిత్తమా
మిత్రమా నా యేసయ్యా
చిత్రమే ఎంతో చిత్రమే

స్నేహం నీ స్నేహం
ప్రాణం నాకు ప్రాణం
నీ స్నేహం నాకు ప్రాణం
ప్రాణం నీ స్నేహం

నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా
|| మిత్రమా - చిత్రమే ||
أحدث أقدم