Nee padhapai padiyunna నీ పాదాలపై పడియున్న పుష్పమును యేసయ్యా


Song no: 6
నీ పాదాలపై పడియున్న
పుష్పమును యేసయ్యా
నీ చేతితో నను తాకుమా
పుష్పించెద ఫలియించెద
యేసయ్యా...యేసయ్యా...ఆ..ఆ

1. వాడిపొయిన పువ్వును నేను
    వాడుకొనుటకు పనికిరానయా
    నీ స్పర్శ చాలును యేసయ్యా
    నీ చూపు చాలును యేసయ్యా
    పుష్పించెదా ఫలియించెదా
    సువాసననే వెదజల్లెదా

2. మోడు బారిన నా జీవితమును
    నీదు ప్రేమతో చిగురింప జేయా
    నీ శ్వాస చాలును యేసయ్యా
    నీ నీడ చాలును యేసయ్యా
    చిగిరించెద ఫలియించెదా
    నీ సాక్షిగానే జీవించెదా
أحدث أقدم