Ninnu chudalani ninne cheralani నిన్ను చూడాలని నిన్నే చేరాలని నీతోనే కలిసి నడవలని


Song no: 3
నిన్ను చూడాలని నిన్నే చేరాలని నీతోనే కలిసి నడవలని
ఆశ నాలో కలుగుచున్నదయా

1. నీతో కలసి నడచినపుడు
    నాదు అడుగులు తడబడలేదె
    నా త్రోవకు వెలుగుగ
    నీవే ఉండాలని
    నీ అడుగు జాడలో
    నేను నడవలని

2. నీదు ముఖమును చూచినపుడు
    నాకు నిత్యము సంతోషమే
    నీ ముఖ కాంతిలో
    నే హర్షించాలని
    నీదు రూపులో నేను మారాలని

3. నీ సన్నిధినే చేరినపుడు
    నిత్యము నీలో పరవశమే
    పరిశుద్ధులతో స్తుతియించాలని
    నీదు మహిమలో           
    ఆనందించాలని
أحدث أقدم