పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు

Song no: 314
    పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు
    ప్రార్థనలు వ్యర్ధముగా పొనీయడు
    ఆలస్యమైనా ఆయన చిత్తమే
    ఏది జరిగిన మేలుకోసమే

  1. నిరాశానిశీధిలోన ఉషోదయం కలుగును
    మరణాంధకారమైన జీవముతో వెలుగును
    నమ్మికతో వేయుకేక ప్రభుసన్నిధి చేరును
    నిజమైన మొర్ర జవాబును పొందును

  2. ఎండియున్న భూమిలోన పచ్చదనం విరియును
    పాడైన చెట్లనుండి ఫలవర్షం కురియును
    అర్పించిన విన్నపం పరిస్థితిని మార్చును
    హృదయవాంచలన్ని తప్పకుండ తీర్చును
أحدث أقدم