Parthana devadevunitho jaripe sabhashana ప్రార్ధన దేవదేవునితో జరిపే సంభాషణ

Song no: 389
    ప్రార్ధన దేవదేవునితో జరిపే సంభాషణ
    ప్రార్ధన ఆత్మదేవునికి హృదయ నివేదన
    ప్రార్ధన తొలగించును మదిలోని ఆవేదన
    ప్రార్ధించిన ప్రాప్తించును పరమాత్ముని దీవెన

  1. తల్లితో పిల్లలు ఊసులాడుకున్నట్లుగా
    గురువుతో శిష్యులు చర్చించుకున్నట్లుగా
    ప్రభయేసుతో మాట్లాడిన సమస్యలు తీరిపోవును

  2. మొరవిని సహాయము చేయగలిగిన
    తండ్రికి విన్నపం తెలియజేసిన
    పలుమారులు అర్ధించిన పరిస్థితులు మారిపోవును

  3. పొందిన మేలులను మదిని తలపోయుచు
    విరిగిన మనసును కానుకగా అర్పించుచు
    కృతజ్ఞత చెల్లించిన దురాత్మలు పారిపోవును
أحدث أقدم