O nesthama ee shubhavartha Lyrics


ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా
నిను ప్రేమించేవారొకరున్నరనే వాస్తవం తెలియునా
నిను రక్షించువాడు యేసయ్యేననే సత్యం తెలియునా
1. నీవు నమ్మినవారే మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ స్వంతజనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చినా
ఊహించనివి జరిగినా - అవమానం మిగిలినా
నిను ఓదార్చేవారొకరున్నరనే వాస్తవం తెలియునా
నీ స్థితి మార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా
2. నీ కష్టార్జితము అన్యాయము చేయువారికే దక్కినా
నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా
ఉద్యోగమే ఊడినా - వ్యాపారంలో ఓడినా
నిను ఓదార్చేవారొకరున్నరనే వాస్తవం తెలియునా
నీ స్థితి మార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా


أحدث أقدم