Nee krupa naku chalunu Lyrics


నీ కృప నాకు చాలును- వేరేమి నే కోరను
బలహీనతలోనైనను నీశక్తి పరిపూర్ణమగును
అ.ప: నీలోనే సంతోషము నీవే నా అతిశయము
1 యేసు నీ కృప వాస్తవము నా నమ్మికకు ఆధారము
భారము పెరుగుతుఉన్నా ఆపద త్వరపెడుతున్నా
నీ కృప నాకు చాలును
2 యేసు నీ కృప శాశ్వతము నా రక్షణకు కారణము
శత్రువు తరుముతుఉన్నా మిత్రులు పగబడుతున్నా
నీ కృప నాకు చాలును
3 యేసు నీ కృప అనంతము నా కీర్తనకు ప్రేరణము
హృదయము పగులుతుఉన్నా నిదురే కరువౌతున్నా
నీ కృప నాకు చాలును


أحدث أقدم