Kanulu therupumaya Lyrics


కనులు తెరవుమయా నీ క్రియలు చూచునట్లు
బయలుపరచకుంటే అర్ధమగుట ఎట్లు
అ.ప: సిద్ధమైనవన్నీ అనుగ్రహింపనీయుము
దాచబడినమేలు అనుగ్రహించి కాయుము
1. సమీపాన ఉన్న నీ సహాయము
సమయోచితమైన గోప్పజ్ఞానము
కనుగొని బలమొందనీయుము
కలవరపడకుండ కాయుము
2. ఆవరించియున్న అగ్నిస్తంభము
ప్రతిశోధననుండి కాయు హస్తము
కనుగొని జయమొందనీయుము
వెనుకకు పడకుండ కాయుము
3. కాచుకొనియున్న నీదు కోపము
అవిధేయతనుండి వచ్చు శాపము
కనుగొని భయమొందనీయుము
అతిశయపడకుండ కాయుము

أحدث أقدم