Jolali padali nayesayya జోలాలి పాడాలి నాయేసయ్య జోజో అంటూ లాలి అంటూ


Song no: 118
జోలాలి పాడాలి నాయేసయ్య  
జోజో అంటూ లాలి అంటూ     
జోల పాట నేను పాడానా       
లాలి పాట నేను పాడనా 

పశువుల పాకే రాజా భవనమాయెగా 
పశువుల తొట్టె పట్టు పానుపాయెగా
పరలోక సైన్యమే కదలి వచ్చెగా 
పరలోక మహిమే ఆవరించెగా

దీనురాలను నను దర్శించావు         
కడు బీదరాలను 
నను కరుణించావు
స్త్రిలందరిలో 
నాపై దయ చూపినావు 
నీ జన్మతో  బ్రతుకు ధన్యమాయెగా

పరలోక దూతల ప్రతిగానలతో         
ధరయందు భక్తుల స్తుతి గీతాలతో 
మహిమ స్వరూపుడా మానూజావతార 
అందుకొనుము దేవా 
మాహృదయార్పాణ     
أحدث أقدم