Kondala thattu kannu letthuchunnanu Lyrics

 కొండల తట్టు - కన్నులెత్తుచున్నాను 
 నాకు సహాయ - మెక్కడ నుండి వచ్చును 

1. భూమి ఆకాశములను - సృజించిన 
 యెహోవా వలన - సాయము కల్గున్  
2. నీ పాదము తొట్రిల్ల - నీయడు 
నిన్ను కాపాడువాడు-కునుకడు ||కొండ|| 
3. ఇశ్రాయేలును కాచు - దేవుడు 
కునుకడు నిద్రపోడు-యెన్నడు  ||కొండ|| 

4. యెహోవాయే నిన్ను - కాపాడును 
నీ కుడి ప్రక్క నీడగా - నుండున్  ||కొండ|| 

5. పగటెండ - రాత్రి వెన్నెల - దెబ్బ 
నీకు తగులకుండ నిను-గాపాడున్ ||కొండ|| 

6. ఎట్టి అపాయము రా - కుండగను 
ఆయన నీ ప్రాణమును - గాపాడున్ 

7. ఇది మొదలుకొని నిత్యము నీ 
రాకపోకలందు నిను-గాపాడున్

Post a Comment

أحدث أقدم