నీ జీవితములో గమ్యంబు యేదో – ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభుయేసు కొరకు – నీ హృదయంబు
నర్పింపవా
1. నీ తల్లి గర్భాన నీవుండినపుడే – నినుజూచె ప్రభు
కన్నులు
యోచించినావా ఏ రీతి నిన్ను – నిర్మించె తన చేతులు
2. నీలోన తాను నివసింపగోరి – దినమెల్ల చేజూచెను
హృదయంబు తలపు – తెరువంగలేవా – యేసు
ప్రవేశింపను
3. తన చేతులందు రుధిరంపుధారల్ – స్రవించే నీ కోసమే
భరియించే శిక్ష నీ కోసమేగా – ఒకసారి గమనించవా
4. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి – సమయంబు
ఈనాడెగా
ఈ చోట నుండి ప్రభు యేసు లేక – పోబోకుమో సోదరా
إرسال تعليق