Nee arachethilo chekkukuntivi నీ అరచేతిలో చెక్కుకుంటివి

    నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా
    నీ నీడలో దాచుకుంటివి నను దేవా } 2
    నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను
    నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను
    నాకన్ని నేవే దేవా
    నా బ్రతుకు నీకే ప్రభువా } 2

  1. దీపముగా నీ వాక్యాన్నిచ్చి
    తిన్నని త్రోవలో నన్ను నడిపి
    నాకు ముందుగా నీవే నడచి
    జారిపడకుండా కాపాడితివి
    కొండ తేనెతో నన్ను తృప్తి పరచి
    అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి
    ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి } 2 ||నాకన్ని||

  2. ఆత్మ శక్తితో నన్ను అభిషేకించి
    అంధకార శక్తులపై విజయాన్నిచ్చి
    ఆశ్చర్య కార్యములెన్నో చేసి
    శత్రువుల యెదుట భోజనమిచ్చి
    ఎక్కలేని కొండలు ఎక్కించితివి
    నా గిన్నె నిండి పార్ల చేసియితివి
    నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి } 2 ||నాకన్ని||
أحدث أقدم