Inthaki manam yevarini preminchali ఇంతకీ మనం ఎవరిని ప్రేమించాలి ? వేటిని ప్రేమించాల

******** *ప్రేమ* ********

*ప్రేమ* ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరికీ తెలియదు.
తొలిచూపులోనే ప్రేమ పుడుతుంది.
ప్రేమ గ్రుడ్డిది.
ఇవి సమాజంలో ప్రేమను గూర్చి వాడుకలో ఉన్న కొన్ని నిర్వచనాలు.,

ప్రేమ ఎలా పుడుతుందో బైబిల్ చెబుతుంది. పరిశీలించు...

1తిమోతి 1:5

*1. పవిత్ర హృదయం నుండి ప్రేమ కలుగుతుంది*
హృదయం కోరికలకు నిలయం.  పవిత్రమైన కోరికలు గల హృదయం నుండి ప్రేమ కలుగుతుంది.
నీ కోరికలు పవిత్రమైనవేనా..?

*2. మంచి మనస్సాక్షి నుండి ప్రేమ కలుగుతుంది*
నీవు చేసేది తప్పో, రైటో నీ మనస్సాక్షి నీకు ఎప్పటికప్పుడు చెబుతుంది.
నీకు చెడు ఆలోచనలు వచ్చినప్పుడు నీమనస్సాక్షి నీపై దోషారోపణ చేస్తుంది.
మంచి మనస్సాక్షి గలవాడవైతే నీవు ధైర్యంగా, హూందాగా, నిర్భయంగా జీవించగలవు.
అటువంటి మంచి మనస్సాక్షి నుండి కలిగేది ప్రేమ.
నీకు అటువంటి మంచి మనస్సాక్షి ఉందా..?

*3. నిష్కపటమైన విశ్వాసం నుండి ప్రేమ కలుగుతుంది*
కల్మషం, నటన, వేషధారణ లేని, కపటం లేని విశ్వాసం నుండి కలిగేది ప్రేమ.. (రోమా12:9)

*4.ప్రేమ దేవునిమూలముగా కలుగును.* 1యోహాను4:7
నీకు కలిగిన ప్రేమ దేవునిమూలముగా కలిగిందా ? లేక నీ శరీరాశలను బట్టి కలిగిందా ?

*ప్రేమిస్తే ఏంచేయాలి ?*

దేవుడు లోకాన్ని ప్రేమించాడు.  మనం నశింపకుండా నిత్యజీవము పొందునట్లు తన స్వంతకుమారుడినే ఈలోకానికి పంపించాడు. (యోహాను3:16, 1యోహాను4:9)

క్రీస్తు నిన్ను ప్రేమించాడు, నీవు పరిమళవాసనగా ఉండుటకు తన ప్రాణంనే బలిగా అర్పించాడు.(ఎఫే5:2, గలతి2:20, 2ధెస్స2:16)

క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. అది కళంకమైననూ, ముడతయైననూ లేకుండా, పరిశుద్దమైన సంఘంగా, మహిమగల సంఘంగా ఉండుటకొరకు తన ప్రాణంనే బలిగా అర్పించాడు. రక్తమునే కార్చాడు (ఎఫె5:25)

ఓ యవ్వనస్దుడా..!
నీవు ప్రేమించే వ్యక్తి నశించిపోకుండా నిత్యజీవం పొందుట కొరకు నీవేమి చేశావు ?

*క్రియ లేని ప్రేమ ప్రేమకాదు.*

ప్రేమించే వాడు...
శిక్షిస్తాడు. (హెబ్రి12:6,సామె13:24)
గద్దిస్తాడు.(సామె 3:12), సన్మార్గంలో నడిపిస్తాడు.

ఓ యవ్వనస్ధుడా నీప్రేమ అటువంటిదేనా..?

*ఇంతకీ మనం ఎవరిని ప్రేమించాలి ? వేటిని ప్రేమించాలి ?*

దేవుని ప్రేమించాలి.(ద్వితి6:5)
క్రీస్తుని ప్రేమించాలి. (ఎఫే6:24)
జ్ఞానంను ప్రేమించాలి. (సామె4:6)
సహోదరులను ప్రేమించాలి (1యోహాను4:21)
తల్లిదండ్రులను ప్రేమించాలి (మత్త10:37)
అన్నదమ్ములను ప్రేమించాలి (ఆది43:30)
శత్రువులను ప్రేమించాలి (మత్త5:44)
తన భార్యను
ప్రేమించాలి.(ఎఫే 5:33, సామె5:19)
నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించాలి.(మత్తయి 19:19)
శిక్షను ప్రేమించాలి (సామె12:1,హెబ్రి12:10-11)
హృధయశుద్దిని ప్రేమించాలి (సామె22:11)
మేలును ప్రేమించాలి (ఆమోసు5:15)
జీవమును ప్రేమించాలి (1పేతు3:10)

*వేటిని ప్రేమించకూడదు ?*

లోకంను ప్రేమింపరాదు.(1యోహా2:15)
లోకంలో ఉన్నవాటిని అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము (1యోహా2:15)
ధనమును,(1తిమో6:9,17,)
ప్రాణమును,( యోహా12:25)
అబద్దమును, (ప్రక 22:15)
దేవునికంటే ఎక్కువగా ఎవరినీ, దేనినీ ప్రేమింపకూడదు. (లూకా14:26,27,33)

ఓ యవ్వనస్దుడా, యవ్వనులారా, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు ?
ఎందుకొరకు ప్రేమిస్తున్నారు ? ఆలోచించండి...

Post a Comment

أحدث أقدم