యేసూ నీ కృపలో నను రక్షించితివా

Davidraj

యేసూ నీ కృపలో నను రక్షించితివా 
నీ నిత్య రాజ్యములో చేర్చుటకు
నీ మహిమ నగరిలో దాచుటకా (2) . . . . . . గమపనిప . . .

1. నీ సిలువ వార్తను లోకములో
ప్రకటించుటే నా భాగ్యమని (2)
నీవు గాక మరి దేవుడెవరయ్య (2) 
నిజ రక్షకుడవు నా యేసయ్య (2)

2. పాపాంధకారము తొలగించితివి 
నీ దివ్యకాంతిలో స్ధిరపరచితివి (2)
యుగయుగములో నీవే దేవుడవు (2) 
ఆరాధింతును ఆత్మస్వరూప (2)
కొత్తది పాతది