నేనును నా కుటుంబమును }
ప్రభుని మాత్రమే సేవింతుము } ॥2॥
మాకు ఏమి జరిగిననూ }
ఎవరూ ఏమీ పలికిననూ } ॥2॥
ప్రభువే మాకూ ఆధారం
ప్రభువే మాకు ఆనందం
హల్లేలూయా హల్లేలూయా ॥4॥నేను॥
1॰
ఎర్ర సముద్రము అడ్డువచ్చిన }
మేము భయపడము } ॥2॥
దేవుని హస్తం కాపాడును
ఎల్లప్పుడు జీవింతుము
॥హల్లేలూయా॥ నేనునూ॥
2॰
యెరికో గోడలు ముందుండినా }
మేము భయపడము } ॥2॥
దేవుని స్తుతించీ ఆరాధింప
గోడలు కూలిపోవును
॥హల్లేలూయా॥ ॥నేనునూ॥
إرسال تعليق