నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును
ఏడాది దూడలనా? - వేలాది పొట్టేళ్ళనా? (2) "నీవు”
1. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2)
గర్భఫలమైన నాజేష్ట పుత్రుని నీకిచ్చినా చాలునా (2) "ఏడాది"
2. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో (2)
కరుణ జూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) "ఏడాది"
3. విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2)
"ఏడాది"
4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? (2)
కపట నటనాలు చాలించి నిత్యము నిను వెంబడించెదను (2)
"ఏడాది"
إرسال تعليق