నా మదిలో మ్రోగేను సితారలు
నా హృదయం పాడెను కృతజ్ఞతలు (3)
ప్రభు ప్రేమను తలపోయుచు
నా యేసుని కృపను తలంచుచు(2) (నా మదిలో)
1) నూతన వత్సర దయా కిరీటం
నా తలపైన ఉంచావు (2)
నీ కృప నాపై చూపావు
నన్ను కరుణించావు (2)(నా మదిలో)
2) మహిమోన్నతుడా మహిమ స్వరూపుడా
మరణపు ముల్లును విరిచిన క్రీస్తు (2)
సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
సతతం నిన్నే స్మరియింతునయా (2) (నా మదిలో)
3) నిను మరువనయా నిర్మల హృదయాల
నిను విడువనయా అడుగడుగునయా
బ్రతికినను నీ కొరకై తండ్రి
మరణించినను నీ కొరకై దేవా (2)(నా మదిలో)
إرسال تعليق