కన్నీళ్ళు విడిచీ నీపాదాలనే కడుగనా నా ప్రాణప్రియుడా నిన్నే ఆరాధన చేయనా
నా సర్వమా... నా యేసయ్యా... ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
1. ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా
నా హృదయం నా ఆత్మతో కుమ్మరించనా దేవా
ఎలుగెత్తి ప్రార్ధన చేసి నీ కృపను పొందెద దేవా - 2
నా కళ్ళలో ఇక నీ రూపమే నిండనీ - 2
ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా "ఆరాధన"
2. నా తలవంచి నీ సన్నిధిలో గోజాడి ప్రార్ధించనా
బహు వినయముతో నీ చెంతే బ్రతుకంత నేనుండనా
నీ నామ స్మరణలోనే ప్రతి ఫలము పొందెదనయ్యా - 2
బ్రతుకంతయు అర్పించి ప్రార్ధించెదా - 2
ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా "ఆరాధన"
3. నా సర్వం నీకర్పించి నీతోనే నే సాగెదా
ప్రియమైన నీ సన్నిదిలో ఆరాధనా చేయనా
ఘనమైన నీదు ప్రేమా నే చాటెద లోకములోన - 2
నీ సాక్షిగా.. జీవించెదా యేసయ్యా - 2
ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా "ఆరాధన"
إرسال تعليق