కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది - సర్వలోకానికి
కల్వరి స్వరము వినిపించుచున్నది - ప్రతీ పట్టణానికి
రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు
1. చూడుము భూమి కంపించుచున్నది - చీకటి జనములను కమ్ముచున్నది - 2
ఎందాక ప్రకటించుట మానెదవు - ఎందాక ఆలస్యం చేసెదవు - 2
ప్రభు త్యాగమునే మరిచెదవా - ప్రభు సేవనే విడిచెదవా ? - 2
రమ్ము ప్రియుడా రమ్ము - క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు
లెమ్ము తెజరిల్లుమయా - క్రీస్తు వార్తను ప్రకటించుటకు - ఈ సువార్తను ప్రకటించుటకు
2. పాపపు ఊభిలో ప్రజలుండగా - సాతాను సంకెళ్లతో బంధించగా - 2
ఎందాక పోరాటం మానెదవు - ఎందాక నిర్లక్ష్యం చేసెదవు - 2

إرسال تعليق