జీవము కలిగిన దేవా స్తోత్రము

    జీవము కలిగిన దేవా స్తోత్రము
    జీవము కలిగిన దేవా స్తోత్రము     }
    జీవింపజేయు నా దేవా  స్తోత్రము }॥2॥
    జీవాత్మనిచ్చు మా ప్రభువా జీవానికి అధిపతి నీవే
    జీవేషా మమ్ము కడిగి జీవింపచేయు నీ సాక్షిగా
                                                       ॥జీవము॥
                   1॰
    జీవపు మాటలు కలవాడా               }
    జీవజలములు మాకు ఒసగువాడా   }॥2॥
    మాకు స్వస్థత నిచ్చువాడా
    మమ్ము చిగురింపచేయువాడా
    మాకు స్వస్థత నిచ్చువాడా
    మమ్ము ఫలింపచేయువాడా

    హల్లెలూయ హల్లెలూయ   ॥4॥
    హల్లెలూయ ఆరాధన ఆరాధన నా యేసుకే  ॥2॥
                                                      ॥ జీవము॥
                  2॰
    సాతాను శక్తుల బారినుండి      }
    సంపూర్ణ విడుదల నిచ్చువాడా }॥2॥
    బండ సందులో పావురమా      }
    మా భయమెల్ల తొలగించుమా  }॥2॥
    ॥హల్లెలూయ॥                             ॥జీవము॥
                   3॰
    పగిలిన బండవు నీవేనయ్యా }
    దాహార్తి తీర్చిన గొప్పదేవా      }॥2॥
    సంతోషము నిచ్చువాడా       }
    సంరక్షించి నడుపువాడా        }॥2॥
    ॥హల్లెలూయ॥                             ॥జీవము॥

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు