క్రైస్తవులలోని కొందరు విశ్వసిస్తున్న నుదిటి వ్రాతలు(తల రాతలు) వాక్యానుసారమా???
ప్రభువు నామములో మీకు మరియు మీ కుటుంబమునకు మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) భూమి మీద ఒక వ్యక్తి తక్కువ వయస్సులోనే చనిపోయినా, తక్కువ కులంలో పుట్టినా, కడు పేద కుటుంబములో జన్మించిన, ఆడవారిగా జన్మించి కష్టాలు పడుతున్నా, తను కోరుకున్నది నెరవేరకపోయిన వీటి అన్నిటికి కారణము మన “ నుదిటి మీద రాతే(తల రాతే) అన్న భావన ప్రజలలో నాటుకుపోయింది.
2) ఒక నూతన జంట వివాహము తరువాత విహార యాత్రకు బయలుదేరినప్పుడు driver నిర్లక్షం వల్లనో, మితి మీరిన వేగం వల్లనో ప్రమాదము సంభవించి వరుడు మరణిస్తే ఆ మరణించిన వరుడి తల్లికి ఒకే బిడ్డ అయితే ఆ తల్లి తన బిడ్డ శవం ముందు కుర్చుని పలికే రోదన ధ్వనులలో ఎక్కువ శాతం దేవుడినే ధుషిస్తూ ,శాపనార్ధాలు పెడుతూ –దేవుడా.......లోకములో ఇంత మంది బిడ్డలుండగా నీకు నా బిడ్డే కనిపించాడా?? అన్యాయముగా నా బిడ్డను పొట్టన పెట్టుకున్నావు కదయ్యా అని అంటూ విధవరాలుగా మారిన నవ వధువును ఉద్దేశించి “””” నీ రాత బగలేదమ్మా ,ఇది దేవుడు రాసిన రాతే ,విధి వ్రాతను తప్పించుకోవడము ఎవరి తరం గాదు అనే మాటల సందర్భాన్ని మనము గమనించొచ్చు.
3) ఒక్కొకరికి ఒక్కో రకమైన తల రాతను దేవుడు వ్రాస్తాడా??????? ఒక వేళ అలా వ్రాస్తే దేవుడు పక్షపతి అవ్వుతాడు. ఒకడు పేదరికములో పుట్టాలని, ఒకడు సంపన్న కుటుంబములో పుట్టాలని దేవుడు ఏర్పాటు చేస్తాడా????? ఒకడు చెడ్డవాడుగా, ఇంకొకడు మంచివాడుగా బ్రతకాలని దేవుడే నియమిస్తాడా???? ఇలా అయితే దేవుడు పక్షపాతిగా వ్యవహరించినట్లు. కానీ దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో చూస్తే అపోకార్య 10:34- అందుకు పేతురు నోరు తెరిచి ఇలా అనెను-దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా నేను గ్రహించాను అని అంటున్నాడు.
4) వృత్తిలో మార్పులు ,చేర్పులకు దేవుని రాతకు సంభందము లేదని, మన జీవన స్థితిగతులను దేవుడు నిర్ణయించడని, అది వారి వారి పూర్వికుల పరిస్థితిని బట్టి ప్రదేశాలను బట్టి ఆసక్తిని బట్టి ఉంటుందని అర్థము చేసుకోవచ్చు.దేవుడు సమానంగా అన్ని కల్పించాడు. కానీ వాటి వినియోగములోనే మనకు వ్యత్యాసము కనిపిస్తుంది. అందరికి ఉపకారము చేయాలన్న దేవుని లక్షణము చూస్తే కీర్తన 145:9- దేవుడు అందరికి ఉపకారి అని ఉంది.. దేవుడు కొందరికే ఉపకారి కాదు. ఆయనలో పక్షపాతి స్వభావము లేదు. మత్తయి 5:45-అయన చెడ్డవారి మీదను, మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి ,నితిమంతుల మీదను, ఆ నితిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.
5) ఇంతకు దేవుడు నుదిటి పై వ్రాత వ్రాసాడంటారా??? ఆ సంగతి అర్థమైతే ఎన్నో చిక్కు ముడులు విప్పబడుతాయి. నుదిటి రాత అంటున్న వారికీ నుదుటిపై ముడతలు తప్ప ఏమి కనిపించవు. ఏ భూతద్దంతో వెతికిన –చర్మపు ముడతలు. స్వేద రంధ్రాలు తప్ప వ్రాత దొరకదు. ఒక వేళా ఉందని కాసేపు అనుకున్న అయన వ్రాసిన వ్రాత వీరికి అర్థం అవుతుందా???? ఇంతకు ఏ భాషలో ఉంది ఈ వ్రాత??? దినిని బట్టి ఎవ్వరు నుదిటిపై వ్రాత లేదు అని సామాన్యముగా అర్థము చేసుకోవచ్చు. ఇంతకు దేవుడు వ్రాసుకున్నది నుదిటి మీదేనా అని bibleలో చూస్తే హెబ్రీ 10:7-అప్పుడు నేను- గ్రంధపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం..... అంటే దేవుడు మన గురించి వ్రాసుకున్నది గ్రంధపు చుట్టలో అని చెప్పబడింది కానీ నుదిటి మీద కాదు అని అర్థమయింది.
6) కీర్తన 139:16-నియమింపబడిన దినములలో ఒకటైనాను కాకమునుపే నా దినములన్నియు( నా భవిష్యత్తు ) నీగ్రంధములో లిఖితములాయేను. ఇక్కడ కూడా అదే విషయం ప్రస్తావించాడు. అనగా మన future దేవుని గ్రంధములో వ్రాయబడింది. పై రెండు వచన సందర్భాలు(హెబ్రీ 10:7, కీర్తన 139:16) ఒకటి క్రీస్తు గురించి, మరొకటి దావీదు గురించి అని అనుకుని నా గురించి మాత్రము ఏమి వ్రాయలేదు అని అనుకోకండి. దేవుడు ఆలోచన తన పిల్లలపై ఉన్నతంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు అనగా job,పెళ్లి,పిల్లలు, సంపద, ఇల్లు వీటి గురించి దేవుడు వ్రాయలేదు. కానీ దేవుడు అందరి గురించి వ్రాసుకున్న ఒకే రాత(ఒక్కొకరికి ఒక్కో రాత కాదు) ఏమిటో bible లో చూద్దాము.
7) ఎఫేసి 1:4-6- మనము దేవుని ఎదుట పరిశుద్దులముగా ,నిర్దోషలముగా బ్రతకాలని జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించి వ్రాసుకున్నాడు. దేవుడు వ్రాసుకున్న ఉన్నతమైన వ్రాత ఏమిటంటే పరిశుద్దుడిగా ,నిర్దోషిగా బ్రతకడం అంతే తప్ప పేదవాడిగా బ్రతుకు, ఫలానా job చేస్తూ బ్రతుకు ..... ఇలాంటి చిన్న చిన్న విషయాలను దేవుడు వ్రాసుకోలేదు.ఇంతకు మనము ఏ పనులు చేసి పరిశుద్దముగా ,నిర్దోషిగా బ్రతకమని దేవుడు వ్రాసుకున్నాడో bible లో చూస్తే ఎఫేసి 2:10- వాటి యందు మనము నడుచుకోనవలెనని దేవుడు ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు ( వాక్యపు పనులు) చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై ,అయన( దేవుడు) చేసిన పనియై యున్నాము.
8) మనము చేయవలసిన వాక్యపు పనులు( వాక్యానుసారమైన జీవితము జీవించాలని) వ్రాసుకున్నాడు.దేవుడు సిద్దపరచిన సత్ క్రియలను మనము చేయాలి కానీ అయన మనతో చేయించడు. సమాజములో అవకాశవాదులు తాము అనుకున్నది సాదించుకుంటే “తమ గొప్ప” అని చెబుతారు. కానీ అనుకున్నది సాదించుకోలేకపోతే “ దేవుని రాత అని తప్పించుకుంటూ ఉంటారు. ఉదా:: సంతానము కలిగేటప్పుడు మగ పిల్లవాడు పుడితే –నేను చెప్పినట్లే మగ పిల్లవాడు పుట్టాడు చూసారా అనే అని అంటారు. అనుకోని విధముగా ఆడపిల్ల పుడితే ఏమి చేద్దాము, దేవుడు రాసిన రాత ఎవ్వరు తప్పించలేరు అని అంటారు.అలాగే bike racing పోటిలలో మితి మీరిన వేగంతో bike నడుపుతూ ,పోటిలలో గెలిస్తే చూసారా నా power అని అంటాడు. అనుకోని ప్రమాదము జరిగి leg,hand విరిగితే దేవుడు ఇలా రాసి పెట్టాడు అని అంటారు.. handle మన చేతుల్లో ఉందా?? దేవుని చేతుల్లో ఉందా ఆలోచించండి...
9) దేవుడు అందరికి ఉపకారి అయినప్పుడు ఒకరికి చెడు జరగాలని, చెడుగా బ్రతకాలని దేవుడు ఆదేశిస్తాడంటారా??? ఒక్క మాటలో చెప్పండి- మద్యం సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని దేవుడు రాత రాస్తాడంటారా????? ఉన్న భార్యను వదిలి రెండో పెళ్ళికి సిద్దమవ్వమని దేవుడు రాత రాస్తాడంటారా?? మితి మీరిన వేగముతో వాహనమును నడిపి ప్రమాదము కొని తెచ్చుకోమని దేవుడు నుదిటిపై లిఖించాడంటారా????? ఇవన్ని మనము చేసుకుంటున్న వివిధమైన స్వయము పనులు. దేవుడు ఇలా బ్రతకమని ఎప్పుడు చెప్పడు. చేయించడు.
10) ప్రసంగి 7:29- దేవుడు నరులను యదర్ధవంతులుగా పుట్టించెను గానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనియున్నారు. అనగా దేవుడు మనిషిని యదార్థవంతంగా పుట్టించాడు, యదార్ధవంతుడుగా ,పరిశుద్దుడుగా, నిర్దోషిగా వాక్యపు పనులతో బ్రతకమని తన గ్రంధములో వ్రాసుకున్నాడు. మనము ప్రయత్నము చేస్తే దేవుని తోడ్పాటు ఉంటుంది. అంతే తప్ప ప్రయత్నము ఏమి చేయకుండా, అయన రాసినట్లు జరగకుండా మానదు అని ఇంట్లో కూర్చుంటే ముద్ద కంచంలోకి రాదు. కనుక ప్రతి పనికి మన ప్రయత్నము అవసరం. ఈ విధముగా పని విషయమై ప్రయత్నము చేయమనేదే దేవుని చిత్తము కానీ నేడు అందరు దేవుని చిత్తమైతే చేస్తాను, చూస్తాను, వస్తాను, కొంటాను, ఇస్తాను అని వారికీ తెలియకుండానే నుదిటి రాతపై నమ్మికయుంచుతున్నారు.
11) దేవుడు రాసుకున్న విధముగా నడిచి చూపిన యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుని గ్రంధపు చుట్ట్టలో రాసుకున్న వ్రాతకు బిన్నముగా ప్రవర్తించి దేవుడు ఏర్పరిచిన మార్గము నుంచి తప్పిపోయిన యుధా ఉన్నాడు. మత్తయి 26:24- ఈ సందర్బ్భాములో దేవుడు క్రీస్తును గురించి వ్రాసుకున్నట్లు క్రీస్తు పోవుచున్నట్లు గమనించగలం. వ్రాయబడిన ప్రకారం దేవుడే జరిగించడం లేదు గానీ కరిస్తే అలాగున వెళ్లుచున్నాడు. దేవుడు దీనికి సహకరిస్తూన్నాడు.ప్రయత్నము క్రిస్తుది.సహాయము దేవునిది.వ్రాయబడిన ప్రకారము అనగా పరిశుద్దులముగాను, నిర్దోషులముగాను బ్రతకాలి,శ్రమలు అనుభవించాలి.ఈ విధముగా క్రీస్తు తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి ,తండ్రి సిద్దపరచిన పనిని ఉన్నదున్నట్లు సంపూర్తి చేశాడు. ఈ మార్గములో క్రీస్తు తనకు తానుగా వెళ్ళాడు, ఆ పని చేశాడు. అంతే కానీ దేవుడే నేట్టలేదు.
12) మరొక వ్యక్తి అయిన యుధా ఇస్కరియోతు మాత్రము దీనికి పూర్తిగా విరుద్ధముగా చేశాడు. తనకు తను తప్పిపోయాడు. అపోకార్య1:25- తన చోటికి పోవుటకు యుధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఇందులో దేవుని ప్రమేయము ఏమి లేదు. అందరు మారు మనస్సు కలిగి,క్రిస్తులా బ్రతికి,తండ్రి దగ్గరకు చేరడమనేది దేవుని చిత్తము.( గలతీ 5:1,1 తిమోతి 2:4, 11 పేతురు 3:9).
13) చాల మందికి కలిగే ప్రశ్నను చూస్తే నేను చెడ్డవాడిగా మారి నరకానికి వెళ్లిపోతాడని తెలిసి దేవుడు నన్నెందుకు పుట్టించాడు?? దేవునికి నా భవిష్యత్తు తెలుసు గదా, మంచిగా మార్చుకోవచ్చు గదా అని అంటారు. దేవునికి భవిష్యత్తు తెలుసు అన్న మాట correct. కానీ దేవుడు నీకై సిద్దపరచిన పనులు నెరవేర్చాలని,దేవుడు ఉన్న లోకానికి నీవు చేరుకోవాలన్నదే అయన(దేవుని) ఆశ. నువ్వు నరకానికి వెళ్ళిపోవాలని దేవుడు ఎన్నడు ఆశించలేదు,ఆశించడు కూడా...
14) దేవుడు జీవితాన్ని ఇచ్చాడు,స్వతంత్రత ఇచ్చాడు. సాతాను ద్వారా సమస్యలు వస్తాయని ,వాటిని ఎలా ఎదుర్కోవాలో bibleలో చెప్పాడు. ఎలా నేర్పుగా నడవాలో భోదించాడు.నడవకపోతే నరక శిక్ష ఉందని హెచ్చరించాడు. ఎందరో భక్తులు ఎలా నడిచారో సాదృశ్యముగా వివరించాడు.దేవుడు చెప్పినట్లు నడవని వారు ఏమయ్యారో bible లో చూపించాడు. ఇప్పుడు చెప్పండి. ఇందులో దేవుని తప్పు ఏమి ఉంది??? ఇన్ని చెప్పిన మనకై మనము తప్పిపోతే,లోకశల్లో చిక్కుకుని నరకానికి జారిపోతే దేవుని ప్రేమేయము ఏముంది????
15) ఆత్మహత్య చేసుకోమని దేవుడు రాత వ్రాయలేదు-కానీ ఆత్మల రక్షణ కొరకు శరీరాన్ని అర్పించాలని వ్రాసుకున్నాడు(1 యోహాను 3:16),, మితి మీరిన వేగంతో వెళ్లి ప్రమాదానికి గురి కావాలని దేవుడు వ్రాయలేదు-కానీ సత్య వాక్యాన్ని బహువేగంగా వ్యాప్తి చెందించి పాతాళమనే ప్రమాదము నుంచి ఎందరినో తప్పించమని వ్రాసుకున్నాడు( కొలస్సి 1:6),,సాతాను పెట్టె శోధనలలో చిక్కుకుని పరలోకాన్ని పోగొట్టుకోవాలి అని వ్రాసుకోలేదు-గానీ సాతనును, వాని క్రియలను జయించాలని వానికి పరలోకములో క్రీస్తుతో పటు సింహాసనము ఇస్తానని వ్రాసుకున్నాడు(ప్రకటన 3:20)
إرسال تعليق