Bible vidhesi pusthakama? బైబిల్ విదేశి పుస్తకమా? క్రైస్తవులు విదేశియులా??

బైబిల్ విదేశి పుస్తకమా? క్రైస్తవులు విదేశియులా??
నశించిపోబోతున్న ఆత్మలను రక్షించుటకు ఈ లోకానికి  వచ్చిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) బైబిల్ అనగా ఒక విదేశి మత పుస్తకమని, క్రైస్తవులంతా విదేశియులని ఇలా నేడున్న ప్రపంచములో క్రైస్తవ వేతరలుఅంటున్న మాటలను ఆలోచిస్తే నిజంగాసత్యము తెలిసిన ఎవరికైనా మనస్సును కలచి వేస్తుంది. అనేకమందికి బైబిల్ పైపూర్తి అవగాహన లేకపోవుట వలన నేడు బైబిలునుగ్రుడ్డిగా వ్యతిరేకిస్తూన్నారు.ఎందుకు బైబిలును అనేకులు వ్యతిరేకిస్తూన్నారు?దీని వెనుక ఉన్న కారణం ఏంటి? కారకులు ఎవరు? ఎందుకు దైవ గ్రంధం సమాజ మధ్యలోకి వెళ్ళలేకపోతుంది అని ఇలా ఆలోచిస్తే  దీని వెనుక ఉన్నదీ మన శత్రువైన అపవాది అని మర్చిపోకూడదు.
2) యాకోబు 1:21-అందు చేత సమస్త కల్మషమును ,విర్రవిగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి “మీఆత్మలను రక్షించుటకు శక్తీ గల వాక్యమును సాత్వికముతో అంగికరించుడి. అనగా మనిషిని కదిలించే ఆత్మను రక్షించే శక్తీ వాక్యముకు ఉందన్న మాటను మనకు తెలియజేయుటకు దేవుడు ఇలా వ్రాయించాడు. ప్రతి మనిషిలో ఉండే ఆత్మను నరకం నుండి కాపాడగలిగే శక్తీ ఒక్క వాక్యమునకే ఉందని చెప్పక తప్పదు. ఒక మనిషి రక్షింపబడటం ఇష్టం లేనిదీ సాతానుకే.  తాను వెళ్లిపోబోతున్న నిత్యాగ్ని దండనకు అనేకులనుతీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన సాతాను కలిగి ఉంది . ఏ వాక్యమైతే మనుష్యులను నరకం నుండి రక్షిస్తుందో ఆ వాక్యాన్ని మనుష్యులకు సాతానుదూరం చేయాలనుకున్నాడు.ఆ వాక్యాన్ని మనుష్యుల చెంత లేకుండా తీసేయాలి అని అనుకున్నాడు.
3) ఎవరిని,ఎలాగు, ఎప్పుడు, ఎంతగా మోసగించాలో మరియు ఎలా మనుష్యుల నుండి బైబిలును దూరపరచాలోన్నవిషయాలు సాతనుకు తెలిసినట్టుగా ఈ ప్రపంచములో ఎవరికీ తెలియదు అని మొదటిగామనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుల చేతిలో ఉంచాడు కానీ అనేక మంది హృదయాలలోకి సాతానువెళ్ళనివ్వడంకుండా ఇలా క్రైస్తవులకు దూరం చేస్తున్నాడు. దివా రాత్రులు ధ్యానిస్తే  అందులో ఉన్న సారాన్ని గ్రహిస్తే తప్ప దేవుని వాక్యం అర్థము కాదు కనుక క్రైస్తవులను మోసగిస్తున్నాడు. ఇక క్రైస్తవ వేతరులకు ఏదో ఒక అబద్దాన్ని పుట్టించి బైబిలును దూరపరుస్తూన్నాడు. క్రైస్తవ్యం విదేశి మతం అని, బైబిల్ విదేశి పుస్తకం అనే తప్పుడు ఆలోచనలను అన్యులకు పుట్టించి బైబిలును తెలుసుకోనివ్వకుండా దూరపరుస్తున్నాడు. ఇలా సాతాను వాడి తంత్రాలు వేసి సమాజపు వారిని దేవునికి దూరంగాతీసుకెళ్ళుతున్నాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.మనుష్యుల మధ్య సాతాను ఎలాంటి గంధరగోల్లాన్ని సృష్టిస్తున్నాడో తెలుసుకోవాలి. ముఖ్యముగా నేడు మన భారత దేశములో కొందరి అజ్ఞానపు మాటలను చూస్తే క్రైస్తవ్యం విదేశి మతం కనుక క్రైస్తవులంతా విదేశాలకు వెళ్ళిపోవాలని మాట్లాడుతున్నారు.
4) బైబిల్ఒక విదేశి మత పుస్తకమా? క్రైస్తవ్యం ఒక మతమా?? నిజముతో సంభంధం లేని నమ్మకాన్ని మతం అంటారు.మతముకు నిజముతో ఏ మాత్రం అవసరత లేదు. మతమని బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పలేదు కానీ సత్యం అన్నాడు. మతం అనేది నిజంతో సంభంధం లేని నమ్మకం అయితే సత్యం అనేది నమ్మకంతో సంభంధం లేని నిజం. ఉదా:: సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు . ఇది నమ్మకమా లేక సత్యమా? ప్రపంచం అంతా ఒక్కటి అయ్యి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే మాటను నమ్మము అని అన్నారనుకొండి అప్పుడు మనం అనే మాట నమ్మకపోతే పొండి అని. ఒక సత్యాన్ని నమ్మే ఒక మనిషికి ఆధారం అవసరమా అంటే లేదనే చెప్పాలి. నమ్మేవాడు ఉన్నను,లేకున్నను సత్యం అనేది ఎప్పటికి సత్యమే కానీ మతం అనేది నమ్మేవాడు ఉన్నంత వరకు నిలబడుతుంది. నమ్మే ప్రజలు లేనప్పుడు మతం కూలిపోతుంది.
5) బారత దేశంలో మొట్ట మొదటిగా వర్ధమాన మహావీర జైను మతాన్ని స్థాపించాడు. ఆ తర్వాత కాలములో బౌద్ద మతం ప్రసిద్ది అయింది. జైనుసూత్ర సిద్దంతాలు కంటే బౌద్ద సూత్ర సిద్దంతాలు నచ్చిన వారు ఎక్కువ శాతం బౌద్ద మతంలోకి వెళ్ళిపోయారు.నానాటికి జైను మతం భారత దేశములో కనుమరుగుపోతూ వస్తుంది. దీనిని బట్టిమనం అర్థం చేసుకోవాల్సింది ఏమనగా అధరించేవారు  ఉన్నంత వరకు మతం నిలబడింది అని, నమ్మే ప్రజలు లేనప్పుడు మతం కనుమరుగు అవుతున్నది. సమాజములో నమ్మే ప్రజలు ఉన్నంత వరకు మతం సమాజములో నిలుస్తుంది కానీ సత్యమునకు నమ్మేవాడు ఉన్న,లేకున్నా ఎప్పటికి సత్యంగానే ఉంటుంది. bible వ్రాయబడిన తొలి దినాల నుండి సాతాను బైబిలును సమాధి చేయాలని పూనుకున్నాడు. ఈ 66 పుస్తకాల మహా జ్ఞాన గ్రంధం ఈ రోజు మన చేతిలో ఉండడానికి ఆనాడు ఎంతో మంది రక్తాన్ని చిందించారు( మత్తాయి 23:35 నుండి). సత్యం ప్రకటిస్తూన్నందుకు ఎందరినో చంపబడ్డారు. సత్యం ప్రకటించువాడిని బ్రతకనియ్యకూడదని అనుకున్నది సాతాను. సత్యాన్ని వారితోనే సమాధి చేయాలనుకున్నాడు  సాతాను. సత్యం ప్రకటించే మనుష్యులను సమాధి చేయగలిగిందో కానీ సత్యాన్ని సమాధి చేయలేకపోతుంది సాతాను.
6) ఎందరో రాజులు బైబిలును సర్వనాశనం చేయాలని,కనిపించకుండా చేయాలని ఎంతగానో ప్రయత్నించినను వారి ఫలితం వ్యర్ధమైపోయింది. అతి పురాతన చరిత్ర కలిగిన గ్రంధమే “బైబిల్”. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు క్రితం వ్రాయటం మొదలైతే క్రీస్తు శకం మొదటి శతాబ్దమున అంతమైనది. ఒకవేళ క్రైస్తవ్యం మతమైతే ,బైబిల్ మత పుస్తకమైతేఎప్పుడోనాశనం అయ్యి కనుమరుగు అవ్వాలి.బైబిల్ సత్యం కనుక అనాది నుండి ఎందరో నాశనం చేయాలనుకున్న ఇప్పటికి సమాజములో నిలబడింది. మతం అనడానికి వీలు లేని మహా జ్ఞాన సంగతులు బైబిలులో ఉన్నాయి.
7) మన దేశానికీ స్వాతంత్రం రావడానికి కీలక పాత్రను పోషించిన వ్యక్తి మహాత్మ గాంధీజీ. అయన చేసిన ఆహింస పోరాటం వలన ప్రపంచమంతట ఆయనను కొనియాడింది. అయన పాటించిన ఆహింస సిద్ధాంతం వలన ఈ ప్రపంచం  ఆయనను మహాత్ముడిగా చూస్తున్నారు. ఒక చెంప మీద కొడితే మరొక చంప చూపమన్న సహనం గాంధీ గారికి ఎలా ఏర్పడింది?ఆహింసతో దేనినైనసాదించవచ్చని,ఆహింస సిద్దంతముతో దేశాలకు స్వాతంత్రం తీసుకురావచ్చు అని ఇంతనికి ఎలా తెలుసు అని అనేకమంది అర్చర్యపోయారు.” గాంధీజీకి మార్గం చూపించిన వ్యక్తి, ఆయనకే గురువుగా,మార్గదర్శిగా నిలిచినా వ్యక్తి  ,ఆయన కంటే ముందు సుమారు 1800 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి నీవు ,నేను,ఈ ప్రపంచమంతట నమ్ముకున్న యేసుక్రీస్తు’నే”. మత్తాయి 5:5-సాత్వికులు ధన్యులు;వారు  భూలోకమును స్వతంత్రించుకొందురు. స్వాతంత్రం సాదించుట సాత్వికతలో ఉందని యేసుక్రీస్తు చెప్పాడు. ఆ మాటకు ప్రభావితమైన గాంధీజీ ఆహింస సిద్దాంతాన్ని బయట పెట్టాడు.
8) ఒకవేళ బైబిల్ విదేశి మత పుస్తకమైతే గాంధీ ఎందుకు ఈ మాటలను స్వీకరించాడు?అయన ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు బైబిల్ చదివినట్టుగా తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నాడు. బైబిలులో ఉన్న యేసు జీవితము, యేసు మాటలే తనకు ఆదర్శమయ్యాయి అని సాక్షాత్తు ఆయనే చెప్పాడు. ఇలా యేసు జీవితములోని అద్భుతమైన మాటలు  ఒకటి,రెండు తీసుకుని వాటి ప్రకారం బ్రతికినందుకే ప్రపంచములో గాంధీజీ గొప్పవాడిగా మిగిలాడు. క్రైస్తవ్యం మతము కాదు. నిన్ను వాలే నీ పొరుగు వారిని ప్రేమించుమన్న ఈ మాట మతం చెప్పింది అని మనిషిని మనిషి ప్రేమించడం మానేస్తాడా? ఇది మతం చెప్పిన మాట ఎలా అవుతుంది? ఒక మనిషి మరొక మనిషిపై ప్రేమ,జాలి చూపాలని చెప్పింది మతం అవుతుందా??
9) ముందుగా బైబిలును మతం అనడం మొదటి తప్పు అయితే విదేశి పుస్తకం అనడం రెండవ తప్పు. విదేశి పుస్తకము కనుక మాకు వద్దు అని అంటున్నారు. నిజముగా బైబిల్ విదేశి పుస్తకమని ప్రకన్న పెడుతున్నారా? భారత దేశములో ఉన్న వారికీ విదేశియత అంటే అస్సలు నచ్చదా? బైబిల్ ఒక విదేశి పుస్తకమనే కారణంతో ప్రకన్న పెడుతున్నారా? కాదు అనే చెప్పాలి. ఒక వేళ విదేశి పుస్తకమన్న భావనతో బైబిలును దూరపరిస్తే నేడు కాలేజీలలో, విశ్వ విద్యాలయాలలో అభ్యసించే ప్రతి సైన్సు విదేశియులు ఆవిష్కరించిన సిద్దంతాలనే సత్యం ప్రతి ఒక్కరు ఆలోచించాలి.న్యూటన్, అర్చేమేడిస్, ఐంస్టీన్ ఇలా ప్రసిద్ది చెందిన శాస్త్రవేత్తలు అంతా స్వదేశియులా? విదేశియులా?? ఈ రోజు వారి సూత్రాలను ఆధారం చేసుకుని ఈ భూమి మీద నుండి అంతరిక్షంకు రాకెట్లను పంపిస్తున్నారు. బైబిల్ విదేశి పుస్తకమని పక్షపాతం చుపిస్తున్నారే మరి అలా అనుకుంటే శాస్త్రవేత్తుల సూత్రాలు కూడ విదేశి జ్ఞానమనే చెప్పాలి. వారి సూత్రాలు తీసుకుని గొప్ప గొప్ప ఆవిష్కరణ చేసినప్పుడు విదేశియుడి జ్ఞానం మనకెందుకుఅని అనుకుంటారా? లేదు. ఈ రోజు భారత సాంకేతికం అంత విదేశి నుండి తెచ్చుకున్నదే.
10) విదేశి పుస్తకాలు కావాలి, విదేశి చదువులు కావాలి, విదేశి ఆయుధాలు కావాలి, విదేశి జ్ఞానంకావల్సివస్తుంది. స్వదేశి అభిమానం ఉంటె లేచినది మొదలు నిద్రపోయే వరకు ప్రతిది విదేశి టెక్నాలజీలతో కూడినదే వాడుతున్నారు. స్వదేశి అభిమానం ఉంటె ప్రతిది స్వదేశంలో తయారు చేసినదే వాడాలి.మనిషిని బాగు చేయలేని ప్రతి విదేశి సంస్కృతినీ మన దేశంలోకి తెచ్చినప్పుడు ఎవ్వడు ఒక్క మాట అనడు కానీ మనిషిని బాగు చేయుటకు మంచి మాటలు ఉండే బైబిల్ మాత్రం విదేశి పుస్తకమని దూరపరుస్తున్నారు. బైబిలుపై ఉన్న కోపం వలన, అసూయ వలన, ద్వేషం వలన అలా అంటున్నారే కానీ నిజంగా విదేశియత పై వ్యతిరేకం ఉంది కాదు.
11) విదేశి మతం నమ్ముకున్నవారు కనుక క్రైస్తవులు విదేశాలకు వెళ్లిపోవాలి అని అంటున్నారు. మనిషి పుట్టుక ఎలా జరిగిందో, మనుష్యులుఈ భూమి పై ఎలా విస్తరించారో,అస్సలు భారత దేశానికీ ఎలా వచ్చారో అను చరిత్ర తెలిసిన ఎవరైనా విదేశియులు,స్వదేశియులు అంటూ మనుష్యులను వేరు పరచరు.చరిత ఏంటో బైబిల్లో చూస్తే ఆదికాండము 11:1-భూమి అంతట ఒక్క భాషయు, ఒక్క పలుకును ఉండెను. నోవాహు జల ప్రళయము తర్వాత గల సందర్భపు లో గల  పై మాట. జల ప్రళయం తర్వాత చివరికి ఒక్క నోవాహు కుటుంబమే మిగిలింది. ఇలానోవాహు కుటుంబము నుండి వచ్చిన సంతానమే మనమంతా. అనగా ఒక మనిషి నుంచి విస్తరించిన వారే ఈ భూమి మీద ఉన్న మనుష్యులంతా.  నేడు పిలవబడుతున్న టర్కీలోమొదటి మానవుడైన ఆదాము పుట్టాడు. బైబిలులో చెప్పబడిన అదేను తోట ప్రస్తుతంటర్కీ దేశములో ఉంది.తొలి మానవుని జన్మ అక్కడే జరిగింది.అప్పుడైతే ఆదాము & హవ్వలు తప్పు చేసారో అప్పుడే దేవుడు అక్కడి నుండి బయటకు పంపివేసాడు. అక్కడి నుండి తూర్పు దిశగా ప్రయాణం చేసారు. ఆదికాండ 3:24-అప్పుడాయన(దేవుడు) ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున....ఆదికాండ 11:2-వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా....పై రెండు సందర్భాలలో తూర్పున పయనించినట్లుగా మనకు అర్థం అవుతుంది.
12) ఈ రోజు ప్రపంచ పటాన్ని చూసి ఆలోచిస్తే మన భారత దేశము కూడ తూర్పున ఉన దేశాలలో ఒక దేశముగా ఉన్నదీ. ఆదికాండ 11:8-ఆలాగు యెహోవా అక్కడి నుండి భూమి యందట వారిని చెదర గొట్టేను...ఈ రోజు భారత దేశంలో నివసిస్తున్న వారంతా ఒకనాడు ఏదో ఒక ప్రాంతం నుండి వచ్చిన వారే..మొట్టమొదటిగా భారత దేశానికీ అడుగుపెట్టిన వారు ద్రవిడులు & ఆర్యులు. వీరు ఇరువురు మధ్య ఆసియా నుండి చెదిరిపోయిన వారే. ఈనాడుభారత దేశంలో నివసిస్తున్న ఏ మనిషి అయిన
విదేశియుడనే చెప్పాలి.
13) విదేశియత అంటే అంత అయిష్టత అయితే నీ దగ్గర  ఉన్న, ప్రతి రోజు కనబడుతున్న  విదేశి వస్తువులను పై అయిష్టత ఉండాలి. ఒకనాడు మధ్య ఆసియాలో ఉన్న నోవాహు కుటుంబము నుండి వచ్చిన వారే ఆర్యులుగా, ద్రవిడులుగా భారత దేశానికీ ప్రవేశించారు. భాషలు మారాయి గనుక, ప్రాంతాలు మారాయి గనుక, మనుష్యుల జాతులు మారాయి గనుక, ప్రాంతాల బట్టి వారి రూపాలు మారాయి గనుక ,వాతావరణం బట్టి వారి వారి ఆకారములో చిన్న చిన్న మార్పులు వచ్చాయి గనుక తాము వేరు వేరు అని మనుష్యులు పోరబడుచున్నారు. జ్ఞానం తెలిసిన,జ్ఞానం ఉన్న ఎవరైనా అనగా ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి ఒకే మనిషి నుండి వచ్చాడన్న సంగతి తెలుసుకుంటాడు. ఆ మొదటి మనిషినే ఆదాము. ఆ ఆదాము నుండి పుట్టిన సంతతే ఈ ప్రపంచములోని వారంతా. అందరు దేవునికి సమానులే.
14) నేను స్వదేశిని, నువ్వు విదేశివి, భారత దేశం నాది,నువ్వు వేరే మతం స్వికరించావు గనుక మరో చోటికి వెళ్ళు అని మాట్లాడుచున్న ఓ మనిషి!!!!!! అస్సలు నువ్వు,నేను, మనము ఈ భూమి మీదకు చెందిన వారమే కాదు. ఫిల్లిప్పు 3:20-మన పౌర స్థితి పరలోకములో ఉన్నదీ.... అనగా మన పౌర స్థితి పరలోకం.మనం పరలోకం నుండి వచ్చిన వారము.దేవుని జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి పరదైశి అనే చెప్పాలి. మనం యాత్రికులుగా ఈ లోకానికి కొద్ది రోజులు బ్రతుకుటకు వచ్చిన వారము. ఈ భారత దేశములో ఉన్న హిందువులుగా,ఇస్లాంగాఉన్నవారి ఆత్మను రక్షింపబడకూడదని సాతాను చేసిన తంత్రమే బైబిల్ విదేశి మత పుస్తకము అని సృష్టించాడు. బైబిల్ అనగా మహా జ్ఞాన గ్రంధము. ఈ ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి మరొక దేశానికీ అనగా పరలోకానికి చెందిన వాడు.

Post a Comment

أحدث أقدم