సృష్టి కర్త యేసు దేవా -సర్వ లోకం నీ మాట వినును
సర్వ లోక నాధ సకలం నీవేగా
సర్వలోక రాజ సర్వము నీవేగా
సన్నుతింతును అను నిత్యము. . . . llసృష్టి కర్తll
1. కానాన్ వివాహములో అద్భుతముగా
నీటిని ద్రాక్ష రసము చేసి
కన లేని అంధులకు చుపునొసగి
చెవిటి మూగల బాగుపరచితివి
నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు llసర్వ లోకll
2. మృతుల సహితము జీవింపచేసి
మృతిని గెలచి తిరిగి లేచితివి
నీ రాజ్యములో నివసింప
కొనిపొవా త్వరలో రానుంటినే
నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో
ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు llసర్వ లోకll
إرسال تعليق