సుదినం సర్వజనులకు - సమాధానం - సర్వ జగతికి
ప్రభు యేసుని జననమానాడు
వికసించెను మదిని నేడు - 2 llసుదినంll
1. చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవితమార్గం ఆ.. ఆ.. ఆ.. ఆ.. -2
పరముకు పధమై అరుదించె - వెలుగై యేసుడు ఉదయించె - 2 llసుదినంll
2. కన్నీటితో నిండిన కనులన్ - యిడుములనన్నిటిని తుడువన్ ఆ.. ఆ.. ఆ.. ఆ.. -2
ఉదయించెను కాంతిగనాడు - విరజిమ్మెను శాంతిని నేడు - 2 llసుదినంll
3. వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే ఆ.. ఆ.. ఆ.. ఆ.. -2
వచ్చును త్వరలో ఆ ఱేడు - సిద్ధపడుమ ఇక యీనాడు - 2 llసుదినంll
إرسال تعليق