Jayaseeluda lyrics జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యా

జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యా
జయమిచ్చు వాడా స్తోత్రముల్ నా ప్రాణప్రియుడా వందనం
ఆ...ఆ..ఆ...ఆ...హల్లెలుయా (2) ఆ.........హల్లెలూయా
1. బలమిచ్చు వాడా బలవంతుడా- శక్తి నిచ్చు వాడా శక్తి మంతుడా
తృప్తినిచ్చు వాడా తనయులకు - ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడా
మాకై మరల రానుంటివా - యేసు (2)
2. ఆదియు అంతము నీవేగా - ఆరాద్యుండవు నీవేగా
అత్యున్నతుడా అతి ప్రియుడా - ఆత్మస్వరూపి ఆశ్రయుడా
అనిశం నిన్నే కీర్తింతును - యేసు (2)
3. నీవే దిక్కని నమ్మితిని - నిన్నే గురిగా ఎంచితిని
నీవే మాకు తండ్రివి - నీకు సమస్తము సాద్యమే
నీపై సర్వం మోపితిని - యేసు (2)

Post a Comment

أحدث أقدم