Inthalone kanabadi lyrics ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్య


ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
అల్పమైన దానికా ఆరాటం
త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి
స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం
దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2)     ||ఇంతలోనే||

బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా
అంతరించిపోయెను భువినేలిన రాజులు (2)
నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా       ||ఇంతలోనే||

మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)
ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున

చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో        ||ఇంతలోనే||


أحدث أقدم