ఏసుక్రీస్తు డిసెంబర్ 25 నే పుట్టాడా ?ఆధారాలు ఉన్నాయా ?*

*ఏసుక్రీస్తు డిసెంబర్ 25 నే పుట్టాడా ?ఆధారాలు ఉన్నాయా ?*
*ఏసుక్రీస్తు యొక్క పుట్టినరోజును మనం పండగలా జరుపుకోవచ్చా?*
మొదటి ప్రశ్న క్రైస్తవేతరుల నుండి తరచూ మనం వింటూ ఉంటాము.
ఈ ప్రశ్నల గురించి క్రైస్తవుల లో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.
క్రైస్తవులు ఈ విషయం లో కంగారుపడవలసిన అవసరం లేదు, మనం మనదేవుడి గురించి ఏదీ గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు,మన దేవుడు గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మనదేవుడు నిజ దేవుడు, ఉన్నవాడు.
క్రీ.పూ 31 నుండి క్రీ.శ 14 వరకు కైసరు అగస్టీస్ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.ప్రస్తుతం ఇది ఇటలీ రాజధాని.నూతన నిబంధన కాలంలో మధ్యధరా సముద్రానికి చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నిటినీ రోమీయులు జయించారు,వారి అధికారం చివరికి ఫ్రాన్స్ ,ఇంగ్లాండ్ ల వరకు వ్యాపించింది,ఈవిధంగా వారి సామ్రాజ్యం యూరప్ ,ఉత్తర ఆఫ్రికా ,మధ్య ప్రాచ్య దేశాల్లో వ్యాప్తి చెందింది.
రోమనులు జయించిన దేశాలలో ఇశ్రాయేలు ,సిరియా లు కూడా ఉన్నాయి.
కైసర్ అగష్టిస్ తాను జయించిన దేశాల పరిపాలనను పునర్విభజన చేసి ,ఆ ప్రాంతాల లో సరిక్రొత్త జనాభా లెక్కలను తీసుకోమని ఆజ్ఞ ఇచ్చాడు.
ఆ సమయం లో కురేనియు సిరియా కు అధిపతి గా ఉన్నాడు,ఆ కాలం లో ఇశ్రాయేలు,దాని రాజధాని యెరుషలేము సిరియా లో భాగము గా ఉన్నది.
దావీదు బెత్లేహేములో పుట్టాడు కనుక ,దావీదు వంశీయులు అందరూ అక్కడే జనసంఖ్య లో లెక్కించబడాలి.కావున నజరేతు లో ఉన్న యోసేపు గర్భవతి గా ఉన్న మరియను తీసుకొని బేత్లేహేము వచ్చి అక్కడ జనసంఖ్య లో వారి పేర్లు నమోదు చేసుకున్నారు,
అప్పుడు బేత్లేహేము లోనే మరియు ఏసుక్రీస్తు కు జన్మనిస్తుంది. మెస్సయ్య బేత్లేహేము లోనే జన్మిస్తాడు అని మీకా 5:2లో చెప్పబడిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ఇదంతా మనం పరిశుద్ధ గ్రంధం బైబిల్ లో చూస్తాము.
అయితే ఇదంతా నిజమేనా ?ఇది మనం నమ్మవచ్చా ? చూద్దాం.
1820 లో జెర్మన్ ఆర్కియాలజిస్ట్ russem ఆధ్వర్యంలో కురేనియు యొక్క పేలెస్ ను త్రవ్వుతున్నప్పుడు పైపరస్ బండిల్స్ దొరికాయి.
పైపరస్ అనేది ఆరోజుల్లో వ్రాయటానికి ఉపయోగించే కాగితం వంటిది.
ఆ బండిల్స్ లో కురేనియు కాలం లో వ్రాయబడిన జన సంఖ్య ఉంది.అందులో 42 లక్షల 33 వేల పేర్లు రికార్డ్ అయి ఉన్నాయి.
జర్మన్ మ్యూజియం లో ఈరోజున కూడా ఆ రికార్డ్స్ ఉన్న బండిల్స్ మనం చూడవచ్చు.
దీనిని బట్టి బైబిల్ కట్టుకథల పుస్తకం కాదు,నిజమైన దేవుని గ్రంధం అని నిరూపించబడింది.
యేసుక్రీస్తు డిసెంబర్ 25నే పుట్టాడా ?
క్రీ.శ 360 లో Dennis the little అనే పురావస్తు శాస్త్రవేత్త రోమన్ లైబ్రరీ నుండి యెరుషలేము దేవాలయం యొక్క temple records తీసి,ఆ రికార్డ్స్ లో ఉన్న ఏసుక్రీస్తు యొక్క సున్నతి దినముయొక్క date ను గుర్తించాడు.సున్నతి జరిగిన ఎనిమిది రోజులు ముందుకు లెక్కించి
వారి కేలండర్ నుండి మనం వాడే కేలండర్ లోకి మార్చి caliculate చేసి డిసెంబర్ 25 న ఏసుక్రీస్తు పుట్టినరోజు అని నిర్ధారణ చేశారు.
ఆ కాలంలో యూదులు పుట్టిన పిల్లవాడికి సున్నతి చేసి ,పేరు పెట్టేటప్పుడు ఆ పిల్లవాడి యొక్క ditailsను temple రికార్డ్స్ లో నోట్ చేసేవాళ్లు.అలాగే ఏసుక్రీస్తు కు కూడా సున్నతి చేసినట్లు గా బైబిల్ లో ఉంది.
ఆ రికార్డ్స్ ఇప్పుడు కూడా రోమన్ లైబ్రరీ లో మనం చూడవచ్చు.
కనుక డిసెంబర్ 25న ఏసుక్రీస్తు పుట్టాడు అని ఏదో ఊహించి చెప్పింది కాదు.దీనికి పక్కా evidens ఉన్నాయి.
*ఏసుక్రీస్తు జన్మదినం ను మనం పండగలా జరుపుకోవచ్చా ?*
ఇది మన క్రైస్తవుల లో కొంతమంది ప్రశ్న.
అపోస్తలులు ఎవరూ అలా చేయలేదు కదా మనం ఎందుకు చేయాలి అంటారు.
అపోస్తలులు సువార్త ను ప్రకటిస్తుఉంటేనే బ్రతకనీయలేదు,ఇంక పండగలు చేసుకోనిస్తారా?
మొదటి శతాబ్దం లో 19 మంది రోమన్ చక్రవర్తులు 250 సంవత్సరాలు క్రైస్తవులను నరికి నరికి చంపారు.పండగలు ఎలా చేసుకోనిస్తారు?
అపోస్తులులు మనకు ఒక బేస్ ఇచ్చి వెళ్ళారు.
దేవుని విషయం లో మనం చేసేపనులు దేవుని మహిమ పరిచేవి గా ఉండాలి కానీ,సాతానుకు చోటు ఇవ్వకూడదు.
క్రిస్మస్ రోజు మనం దేవుని గురించే ఎక్కువగా ధ్యానిస్తాము,ఘనపరుస్తాము,మహిమ పరుస్తాము.
మహోన్నత స్థలములో ఉండే దేవుడు ,మనకోసం భూమిమీద కు వచ్చి, అనేక శ్రమలు అనుభవించి ,మనకోసం ప్రాణం పెట్టిన యేసయ్య భూమి మీద జన్మించిన రోజును మనము పండగలా జరుపుకోవడం తప్పు ఎలా అవుతుంది.
ఆయన తనను ఘనపరచటాన్ని ఎప్పుడూ కాదనలేదు,ఆయన పట్ల మనం అతిశయ పడటాన్ని ఆయన కాదనడు.
ఏసుక్రీస్తు యెరుషలేము లోకి ప్రవేశించేటప్పుడు అక్కడి జనం కొంతమంది ఏసుక్రీస్తును ఘనపరుస్తూ ఉంటారు.
అది చూస్తున్న అక్కడి శాస్త్రులు,పరిసయ్యులు కొంతమంది ఓర్చుకోలేక ఆ ప్రజలయొక్క ఆనందాన్ని ,వారి ఉత్సాహాన్ని ఆపమని ఏసుక్రీస్తు తో చెబుతారు.
అప్పుడు ఏసుక్రీస్తు చక్కని మాట చెబుతాడు.
Luke(లూకా సువార్త) 19:39,40
1.ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులుబోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా
2.ఆయన వారిని చూచివీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను.
అంటే దేవునిపట్ల మనం పండగ జరుపుకుంటు,ఉత్సాహం గా ,ఆనందం గా ఉండటం ఆయనకు ఇష్టమే.
ఆయన యందు మనం అతిశయపడటము తప్పుకాదు.
ఈ పండుగ ను లోకస్తుల వలే కేవలం క్రొత్త బట్టలకు,పిండి వంటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆరోజు అంతాకూడా దేవునిని ధ్యానించటానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఒక్కరికీ నా మనవి.
*చింత లేదిక ఏసుపుట్టెను వింతగను బెత్లేహమందునా...*
*చెంత చేరగా రండి సర్వ జనాంగమా...*
*సంతసమొందుమా...*solomon raj

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © Lyrics List. Designed by OddThemes