సహాయము నీవే స్నేహము నీవై - శాశించావు స్వాస్థ్యము కొరకు
మారని వాడవు నీవు మార్పులేనివాడవు నీవు
నిన్నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు|| అన్ని నీవే ||
1. రాత్రివేళ వెలుగిచ్చుటకు అగ్ని స్థంభమై నిలిచావు
పగటివేళ దారి చూపుటకు మేఘస్థంభములో ఉన్నావు
ఎర్రసముద్రము దాటుటకు వీపునే దారిగచేశావు
మోసిన వాడవు నీవే మార్గము చూపింది నీవే
అగ్నివి నీవే అభయము నీవే అగ్నిని చల్లార్చె ఉదకము నీవే|| అన్ని నీవే ||
2. ఇశ్రాయేలుకు ముందుగా నడిచినవాడవు నీవే
పంచభూతాలె ఆజ్ఞకు ఆయుధాలుగా మారె
శత్రు సమూహాలన్నిటిని హతమార్చినవాడవు నీవే
కాచిన దేవుడ నీవే సమకూర్చిన వాడవు నీవే
కాపరి నీవే మేపరి నీవె ఇశ్రాయేలుకు ఊపిరి నీవే|| అన్ని నీవే ||
3. మరణశాసనం రాశావు ఆ మరణాన్నె నీవు పొందావు
మరణపు ముల్లును విరిచావు నిత్యజీవమే తెచ్చావు
సిలువ యజ్ఞలంలోనే సాతాన్నే ఓడించావు
మనిషిగా మారింది నీవే ఆ మహిమలో ఉన్నది నీవే ఆదియు నీవె అంతము నీవే అన్నిటికి సారధినీవే. || అన్ని నీవే ||
إرسال تعليق