a78

78

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసు భజనయే మనలను ఆ సుగతికి దీయు జనులారా దాసజనులు జేయు పలు దోసములు మోయు ||యేసు||

  1. మేల కులశీల వ్రత జా లాధిక మేల చాల మన మీలాగున గాలావధి గూల||యేసు||

  2. అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత మోక్ష యను దీక్షన్||యేసు||

  3. మాటికి మిన్నేటికి బో నేటికి గాల్ నొవ్వ సూటిగ నరకోటి దురిత వాటములను మీటు||యేసు||

  4. శ్రోత్రమ యపవిత్ర నర చ రిత్రలు వినబోక మైత్రిని బరమాత్ముని కథ మాత్రము విను మనుచున్||యేసు||

  5. మన జీవనమునకు మారుగ తన ప్రాణము నిచ్చెన్ తన రక్తముచే బావన మొనరించెను మనలన్||యేసు||

Post a Comment

أحدث أقدم