a75

75

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మంగళంబని పాడరే క్రీస్తుకు జయ మంగళంబని పాడరే యేసుకు జయ మంగళంబని పాడరే మంగళంబని పాడి సజ్జ నాంగ పూజితుడై కృపాత రంగిలోక సమూహ పాపవి భంగుడని యుప్పొంగి జయజయ ||మంగళ||

  1. ఘన యూద దేశంబులో బెత్లెహే మున యూదా గోత్రంబులో విను డు యేసేపునకు సతియై తనరుచుండెడి మరియ కడుపున జననమై యీ మర్త్య వరులకు సద్గతిని గల్గించు వానికి||మంగళ||

  2. సోదరాళి భంగిని భక్తుల నల్ల జూచి ప్రోచెడు వానిని యూద దేసపు వారలధిక బాధబెట్టుచు హింసజేసిన సాదరంబున త్రిదినములకు ముదముతో గనుపడిన ప్రభునకు||మంగళ||

  3. ధరణి న్గొల్చెడి దాసజ నములనుబ్రోచు దైవ తనయుడని నిజ మరయ నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధి దరికి( జేర్చు పరమ పదమే యిరు వొనర్చెద ననిన ప్రభునకు||మంగళ||

Post a Comment

أحدث أقدم