a56

56

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    రాత్రియయ్యెన న్నెడబాయకు ధాత్రిపై జీకతులు గ్రమ్మెను సహాయ మేమి లేనివారికి సహాయుడా, నన్ బాసిపోకుమీ.ఏకాలంబైన నీ సహాయము లేక పిశాచిన్ గెల్వజాలను నీకంటె నాకు లేదుగా లోక ప్రకాశుడా, నన్ బాయకు.నా చెంత నీవు చేరియుండగ ఏ చింతయైన నన్ను సోకునా ఏ శత్రువైన నన్ను గెల్చునా? నా శైలమా, నన్ బాసిపోకుమా.సమృద్ధుడు సహాయు డాయెను ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా? సమాధి నీకు జయమబ్బునా? మా మధ్యమున్ సర్వేశ పాయకు.రేవు నే జేరబోవు వేళలోన్ కావుమయ్యా నీ దీప్తి జూపుచున్ చావు జీవంబులందు నైనను నీవు తోడై నన్ బాసిపోకుము.

Post a Comment

أحدث أقدم