a502

502

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ఎంతో శృంగార మైనది యేసుని చరిత మిది యెంతో వేడ్కై యున్నది మోక్ష ప్రవేశ మంతటఁ దేజో వంతుఁడు క్రీస్తుఁడు చెంతను దూతా శ్రితజన వజ్ఞ్క్తులు వింతగ నుడువఁగ సంతత నవ్య వ సంతము గల్గియ నంతజీవ రస వంతఫలోప వనాంతర ములు ద త్ప్రాంత ఋనగల పరమపురమునకు సంతసమున జనె జయశబ్దముతో ||ఎంతో||

  1. తెరచి మూయంగ రానట్టి ద్వారములారా మీ శిరము లెత్తుకొని యుండు డి యనాదిగ నుండు వర క వాటములారా మీరే యెత్తంగఁ బడుఁడీ సురచిన మహిమ స్ఫురణలుగల మీ దొరతన పరిశుద్ధుల కరు లగు భీ కర దురితాత్ముల దురమునఁ జిదిపి య పరిమిత బల జయ బిరుదాంకితు డై చిరముగ నూతన యెరుసలేమ పుర పరి పాలనఁ ద త్పరుఁడై యిదిగో నెరవుగ వచ్చెను నిజ భక్తులతో ||ఎంతో||

  2. సుందర మందానిలమందు జీవ సంజీవా నందసౌఖ్య ప్రదమై యుండ రేబగ లంటని మందిర వాసులప్పుడు జయజయశబ్దములఁ బొందుగఁ గ్రీస్తుని పొగడుచుఁ బాడుచు నందఱు పరమా నందంబునఁ జె న్నొంది తనందరి కిందగు రాజుగ వందనములు తగ వరుస నొనర్చుచు నందముగా ప్రభుఁ జెందిన భక్తుల బృందములకుఁ దగు విందు లొనర్చిరి పొందిక కలిగెను భూమికి ముక్తికి ||ఎంతో||

  3. ములపైఁ బెట్టి కళ లీను ధవళ వస్త్రములు గట్టంగ నిచ్చి చెలువుగ మరి వా రల చేతుల లో పల విజయార్థపు బర్ణము లొసఁగి సకల దూతలు భ క్తులతో గూడి వి మల పీఠము ముం గల నిలువబడి పొలువగఁ దమ దే వునకును గ్రీస్తున కెలమిని స్తోత్రము బలఘన మనిశము కలుగును గాకని పలికి నుతించిరి ||ఎంతో||

  4. పరిశుద్ధవంతు లప్పుడు శాశ్వతానంద భరితులై వీణెలు ధరియించి పాటులు బాడుచును గురురాయఁడైన తమ ప్రభుని గుణములు వర్ణించి కరుణను నీ ర క్తముచే మము నం దఱి ధరణింగల నరవంశస్థుల తరములలో నుం డరుదుగ దేవుని కొఱకుఁగదా మముఁ గొనియుంటిని యని మురువుగ నిఁక దే వుని కొఱకుఁగదా మముఁ గొని యుంటిని యని మురువుగ నిఁక దే వుని సముఖంబున దొరలను నర్చక వరులఁ జేసితివి ధర నేలుదు మిఁక సరియని మ్రొక్కిరి ||ఎంతో||

    ✍ పురుషోత్తము చౌధరి

      Yentho Srungara Mainadhi-Yesuni Charitha- Midhi Yentho Vedkai Unnadhi - Moksha Pravesha = Manthata Dejo- Vanthudu Kristhundu – Chenthanu Dhoothaa – Shrithajana – Panjuloo – Vinthaga Nuduvanga – Santhatha Navya Va – Santhamu Galgiyu – Nothajeeva Rasa – Vanthaphalopa Va – Naanthara Moola Dha – Thpraantha Bhunagala- Parama Puramunakhu = Santhasamuna Jane – Jayashabdhamutho || Yentho ||

    1. Therachi Mooyanga Raanati–Dwarammulara Mee – Shira Mu Lethukoni Yundudi – Yanaadhiga Nundu – Vara Ka Vaa Tamulaaraa Mere – Yethanga Badhundi = Surachina Mahi Ma–Sphuranlugala Mee – Doora Thana Parishu-Dhula Karu Laghu Bhi Kara Dhuri Thaa Thmula Dhooramuna Jhidhipi Yaa – Parimitha Bala Jaya–Bhirudhankithu Dhai – Chiramu Ga Nuuthana – Yerusalema Pura – Pari Paalana Dha – Thparundai Idhigo Neruvuga Vachenu – Nija Bhakthulatho || Yentho ||

    2. Sundara Mandhaanilamandhu – Jeeva Sanjeevaa – Nandhasoukhya Pradhamai Yunda – Rebagha Lantini – Mandira Vaasulaphudu – Jayajayashabdhamula = Bhondhugu Greesthuni – Pogaduchu Baaduchu – Nandaru Paramaa- Nandambhuna Jai – Nondhi Thanandhari – Khindhagu Raaju Ga – Vandanamulu Thaga- Varusa Nonarchu – Nandhamugaa Prabhu – Jendhina Bhaktulu- Brudhamulaku Dagu – Vindhu Lonarchiri = Pondhika Kaligenu – Bhoomikhi Mukthiki || Yentho ||

    3. Mulapai Beti – Kala Leenu Davala Vastramulu – Gatinga Nichi = Cheluvuga Mari Vaa – Rala Chethula Lo – Pala Vija Yaarthapu–Barnamu Losinga Sa–Kala Dhoothalu Bha– Kthu Latho Goodi Vi – Mala Peetamu Mum – Gala Niluvambadi – Polugava Dama Dheee – Vunakunu Greeesthuna – Kelimi Ni Sthothramu – Balaghana Manishamu = Kalughunu Gha Kani – Paliki Nuthichiri || Yentho ||

    4. Parishudhavanthu Lapudu – Shashwathaanandha – Bhari Thulai Veeenelu Dhareenchi– Paatulu Bhaduchunu – Gururaa Yundaina Tama Prabhuni – Gunamulu Varninchi = Karuna Nu Neee Ra – Kthamuchai Mamu Nam – Dhati Dharingala – Naravamshasthula – Tharamulalo Nun – Darudhuga Devuni – Korakunghadha Mamun – Goniyuntini Yanimuruvuga Ninka Dhe – Vuni – Korakungadha Mamun – Goni Yuntini Yani – Muruvagha Ninkha Dhe – Vuni Samukhambhuna – Dhoralanu Narchaka Varula Jesithivi = Dhara Nailadhu Minka – Sariyani Mrokiri || Yentho ||

      ✍ Purushotthamu Choudhary

Post a Comment

أحدث أقدم