496
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యేసు మేఘారూఢూండై యిలకు దిగ వాసిగ దూత లపుడు భాసురంబుగ బాకా పై నినాదము సేయ గ సమాధుల నిద్రగాంచు జనులెల్లరు ||లేచు||
- కడబూర ధ్వని సేయగ మడిసిన వారు తడవు సేయక లేతురు ఎడతెగక ప్రభు నొద్ద గడు సంతసంబుతో విడువక యుందు రా విమల లోకమునందు ||లేచు||
- ఘన మహిమన్ బ్రభువు రాగన్ గడలి యపుడు తన యందుండెడి శవములన్ ఘనముగ గాననము దనయందుండెడు మృతులన్ వినయంబుతో దెచ్చి విభుని కప్పగింప ||లేచు||
- అరయంగ నీతపరు లా నందమున న క్షర దేహులై వెలయుచున్ జిరత రానందంబు బరలోకమున నెపుడు స్ఫురిత జీవను లగుచు బరమ సుఖ మొందుదురు ||లేచు||
- కరుణ లేని సమాధీ నిరతము నన్ను జెరపట్టి యుంచగలవే వరదుండు క్రీస్తుండు వర దూత సేనలతో బరివేష్టితుడై యదిగో నరుదెంచుచున్నా డు ||లేచు||
- మరణమా నీ ముల్లేది నరులను నింక వెఱపించు చుండగలవే మరణ సంహారుండు మహిమతో నరుదేరన్ మరణం బడుగుబడి య మర త్వంబిక నుండున్ ||లేచు||
- మరణంబు నొందలేదా ప్రభు యేసు నీ చెఱయందు నుండలేదా పరమేశు తనయ
إرسال تعليق