a484

484

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పోపోవే యో లోకమా చాలికజాలు నీ పొందు మే మొల్లము పాపేచ్ఛలున్నంత సేపు నొపగ రాని వేపాట్లు బెట్టితి వీపట్ల నను వీడి ||పోపోవే||

  1. సకలేంద్రియ వ్యాప్తులు నీ సేవ బా యక చేయు దివసంబులు ఇ క దీరి పోయె భ్రా మికము జూపకు మిపుడు ప్రకటమ్ముగ గ్రీస్తు పద భక్తి మా కెబ్బ ||బోపోవే||

  2. నీ రాజు బహుమానము గంటిమి ఘోర నరకాంబుధి తీరము దారి దొలగి నిన్ను జేరి దుఖముల వే సారి తిప్పుడు క్రీస్తు సదయుడై ననుబిల్చె ||బోపోవే||

  3. ఎఱ జూపి బలు మీనము బట్టెడు వాని కరణి వస్తుల రూపము బొరి జూపి లోభము బుట్టించి ననుబట్టి పరిమార్చితివి యింక మరి యేమున్నది చాలు ||బోపోవే||

  4. ఎండమావుల తేటలు నీ విచ్చెడు దండైన యిహ సుఖములు కండ గర్వముచే నీ యండ జేరితిగాని నిండు నెమ్మది దయా నిధి క్రీస్తు డిపు డిచ్చు ||బోపోవే||

Post a Comment

أحدث أقدم