45
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను ||వేడెద||
నే బాతకి నజ్ఞానుడ ప్రభువా నీవు కరుణజేయు పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు ||వేడెద||
పాపము గని భీతుడనై శంకా పరత సతము నుండన్ నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్ ||వేడెద||
నాదగు పాప భరం బంతయు నీ మీదనె యిడుచుందున్ నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్ ||వేడెద||
అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్ భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు ||వేడెద||
إرسال تعليق