446
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఎన్ని శ్రమలు వచ్చిన లోకపు టాశ లన్ని భిన్నము నొందిన నన్ను ఖిన్నునిజేయ నేరవు సన్నుతుండును స్వర్గము నన్ని నావైయున్న విగ నిక నన్ను గదుపున దెవ్వరు ||యేసు||
- ఆపదల్ నను జుట్టిన జేరుదు నే నో పరాత్పర రొమ్మున బ్రావ కుండవు పతితుడై నీ దాపు జేరిన వానికిన్ దాప మాపుచు సంతసంబిడి ధన్యు జేయుదు వీవెగా ||యేసు||
- నిను బ్రేమించెడు తండ్రిని నా యాత్మా నిను రక్షించిన క్రీస్తును గనుమునిన్ను జొ చ్చిన ప్రియాత్మను ఘన త్ర్యేకుని నిత్యమున్ గొనుము రక్షణ, పాపము చింతను విడిచి యిం కెన్నడున్ ||యేసు||
- విశ్వాస కవచంబును మేను నిడి విజ్ఞాపనము చేయుము శాశ్వతంబగు రాజ్యమునకును సదయుడౌ ప్రభువు నడుపు విశ్వసితము లభించునట నీ విన్నపము స్తుతి యౌనుగా ||యేసు||
إرسال تعليق