a445

445

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నేను నీ వాడను దేవా నిక్కంబుగ నేను నీ వాడను దేవా వీనుల నీ ప్రేమ వివర మాలించుచు మేను నాత్మయు నిత్తు మేలొసగు నీకిపుడు ||నేను||

  1. ఘనుడ వైన నీవు గలిగించితివి నన్ను మనుజ లోకమునందు నిను నేను సేవింప ||నేను||

  2. నాకు నవసర మౌన నానా వస్తువు లిచ్చి నీ కటాక్షము నన్ను నిల్పుచున్నది గాన ||నేను||

  3. నా దోషముల నుండి నన్ను రక్షింపను నీదు పుత్రుని ప్రేమ నిండార నొసగితివి ||నేను||

  4. నే నఘముల చేత నిజముగ జావగ నీ నెనరుచే నన్ను నీవు బ్రతికించితివి ||నేను||

  5. నా తనువు నాత్మయు నాకు గల్గిన వన్ని నా తండ్రి యిచ్చితివి నాకు నీ కృప చేత ||నేను||

Post a Comment

أحدث أقدم