a438

438

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    విమల హృదయ మిమ్ము విదితంబు నిను గొల్వ యేసునాధా నీదు విమల రక్తము చేత విశదమౌ యెద నిమ్ము విశ్వనాధా ||విమల||

  1. అణకువ క్షమశాంత మధికముగ నాకిమ్ము ఆత్మనాధా నీకు బ్రణుతమౌ నా యెద ప్రభునిపీఠము జేయు మాత్మనాధా ||విమల||

  2. నీ చిత్తమే యంచు నీ పాదముల బట్టి నిల్చియుందు నిండు నికరమౌ ప్రకటమౌ సుకరహృదయ మిమ్ము మేసునాధా ||విమల||

  3. భయభక్తు లలరెడు భావంబు నా కిమ్ము జీవనాధా నన్ను లయ జీవములయందు జయశాలినిగ జేయు మేసునాధా ||విమల||

  4. పరిశుద్ధ హృదయంబు పరమేశ నా కిమ్ము ధరణిమీద నన్ని తరుణములను నాకా దరణ మీవే యంచు దలప నాధా ||విమల||

  5. నీ రూపము నిమ్ము నిను బోలి నేనుండ నిత్యనాధా నీదు సారూప్య మెదమీద సంపూర్తిగా వ్రాయు సత్యనాధా ||విమల||

  6. ప్రేమపూరిత హృదయ మేమరక నా కిమ్ము ప్రేమనాధా యెంతో ప్రేమమౌ సుమమౌ నేమమౌ బ్రతుకిమ్ము క్షేమనాధా ||విమల||

Post a Comment

أحدث أقدم