433
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఇహసంబంధుల పొందు జాలింతమ మహా మహుడౌ దేవుని యాజ్ఞ బాలింతమ ||యేసు||
- శుభవార్తర్థము లన్ని శోధింతమ యేసువిభు సత్యమిలలోన నుభవింతమ ||యేసు||
- దోషములను బైట బెట్టుదము కపట వేషభాషల గ్రుంగ బట్టు దమ ||యేసు||
- మన రక్షకుని పాట్లు మది నెంతమ మనసు లోపలి గర్వము లణుపుదమ ||యేసు||
- జనుల నిందల కెల్ల నోర్చెదమ బోధ కనిపెట్టి ప్రభు చెంత నేర్చ దమ ||యేసు||
- మానావమానముల్ భరియింతమ యోర్వ లేని గుణముల వేరు బెరుకుదమ ||యేసు||
- పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ బుద్ది పరమానందము జాడ నడుపు దమ ||యేసు||
- సకల మానవు లాత్మ సరిచూతమ యింక మొక మిచ్చకపు మాట ల్విడిచెదమ ||యేసు||
- దినము ప్రార్థన జేయ గురి యుంతమ చెడ్డ మనసు బద్ధకముపై నెదిరింతమ ||యేసు||
- గురు బోధ స్థలికి బిరబిర బోదమ బుద్ధి తిర ముంచి వాక్యార్థ మెఱు గుదమ ||యేసు||
إرسال تعليق