42
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నిద్రపోయిన వేళ నిఖిలాపదులబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షుల గేలు మోడ్చి మ్రొక్కుచును ||దెల్లవారిన వేళ||
భానుడుదయం బయ్యె బద్మములు వికసిల్లె గానమలు జేసె బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నిను డనెడి ప్రభు జూచి వేడ్కన్ ||దెల్లవారిన వేళ||
దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచున్ ||దెల్లవారిన వేళ||
పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాగి యాపదల దొలగించు మని వేడుకొనుచున్ ||దెల్లవారిన వేళ||
إرسال تعليق