a417

417

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి నా కిమ్ము శ్రీ యేసువా లోక రక్షక నన్ను నీ లోపల దాగి వీకతోడను నుండనిమ్ము సద్గుణ శీలా ||నాకై||

  1. చీలబడిన నీదు ప్రక్క విడిచి పారు జాలు జలము రక్తము చాల నా పాపపు తీర్పు పాపబలమ్ము చాలు రూపును మాపి నన్ను బావను జేయు ||నాకై||

  2. నీదు న్యాయంబగు ప్రామన్య విధులను నాదు సత్కృతి తృప్తిగా నాదరింపవు పారమార్థకమైనట్టి నాదు నాసక్తి బాష్పమును బారిన నాకు ||నాకై||

  3. నేను జేసిన పాపముల ద్రుంప నెవరిని గాన నేరను యేసువా దీను డనై వచ్చి నీ మేటి సిల్వను మానక నే హత్తుకొనియెద సచ్చరిత ||నాకై||

  4. కట్ట బుట్టము లేక పుట్టముకై యాశ బుట్టి నీ యెడ వచ్చితి నెట్టి సహాయము లేక నీపై మది బుట్టి నీ సత్కృఋప బొందజూచెద నయ్య ||నాకై||

  5. పరమకల్మషుడనై నే నీటి ఋగ్గకు బరుగు లెత్తెద నిప్పుడు పరమ పావన నన్ను( గడుగుము లేకున్న మరణ మొందుదు నేను ఘోర పాపవిదూర ||నాకై||

Post a Comment

أحدث أقدم