41
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెను మ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూల కర్తకు గొలువసేయగ ||మేలుకొనరే||
పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్క దొడగెను రక్షకుని సకలోపకృతులను రమ్యముగ నుతియించి పాడగ ||మేలుకొనరే||
నిదుర బోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండక పదిలముగ రక్షించు దేవుని బ్రస్తుతింప మహాముదంబున ||మేలుకొనరే||
మేటియౌ హృదయాబ్జములలో మీ కృతాజ్ఞతా భూషణంబులు నేటుగా ధరియించుకొని యిటు నిర్మలాత్ముని బూజసేయగ ||మేలుకొనరే||
తెల్లవారగ దెలియరే యిది తెలివిగల మానవ సమాజము యల్లసిల్లుచు నీతి భాస్కరుడుదయ మయ్యెను హృదయముల పై ||మేలుకొనరే||
إرسال تعليق